YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

 సప్తవాహనాలపై సిరులతల్లి అభయం

 సప్తవాహనాలపై సిరులతల్లి అభయం

 సప్తవాహనాలపై సిరులతల్లి అభయం
తిరుపతి    ఫిబ్రవరి 1 
సూర్యజయంతిని పురస్కరించుకొని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో రథసప్తమి వేడుకలు శ‌నివారం ఘనంగా జరిగాయి. ఒకేరోజు ఏడు వాహనాలపై అమ్మవారు దర్శనమివ్వడంతో ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలను తలపించాయి. ఉదయం భానుని రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మ‌వారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనందపరవశులయ్యారు.తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా శ‌నివారం ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారు ఏడు వాహనాలపై భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.ఉదయం 7.00 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం 2.00 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది.  ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చంద‌నంతో అభిషేకం నిర్వ‌హించారు.  కాగా సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు గజ వాహనంపై అమ్మవారు దర్శనమిచ్చారు. శ్రీ సూర్య‌నారాయ‌ణ‌స్వామివారి ఆల‌యంలో.... తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచారపరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో  భజన బృందాలు పాల్గొన్నాయి. కోలాటాలు, చెక్కభజనలు, చిడతల భజన తదితర ప్రదర్శనలిచ్చారు.

Related Posts