YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ఇది సినిమా కాదు బాలయ్య

 ఇది సినిమా కాదు బాలయ్య

 ఇది సినిమా కాదు బాలయ్య
అనంతపురం ఫిబ్రవరి 01
సినిమాల్లోలాగా కనుసైగ చేస్తే సుమోలు లేవవనే విషయాన్ని బాలయ్య గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ హితవు పలికారు. బాలకృష్ణ కాన్వాయ్‌ను అడ్డుకుని బాలకృష్ణ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేసిన ప్రజా సంఘాల పరిణామంపై మహమ్మద్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ బాలకృష్ణ కనుసైగ చేస్తే ఏమయ్యేది అనడం ఆయన మానసిక స్థితి ఎలా ఉందో తెలియ జేస్తోందని అన్నారు. గత 30 సంవత్సరాల నుంచి హిందూపురం బాలయ్య కుటుంబానికి పట్టం కడితే నియోజకవర్గ అబివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రైవేటు కార్యక్రమలకు సంవత్సరానికి రెండు, మూడు సార్లు వచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు.  బావ చంద్రబాబు అమరావతిని ఏటీఎంలా వాడుకుంటే బావమరిది బాలకృష్ణ  హిందూపురాన్ని పేటీఎంలా వాడుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. హిందూపురానికి తాగునీరు తెచ్చే అమృత్‌ పథకంలో తెలుగు దేశం దొంగల అవినీతి త్వరలో బయట పడుతుందని తెలిపారు.

Related Posts