బడ్జెట్ లో ఏపీకి మొండిచేయి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1,
కేంద్రం 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు చేయలేదు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను కూడా ప్రస్తావించలేదు. ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టుకు నిధులు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్ధిక సాయం లాంటివి ఆర్ధిక మంత్రి ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించకపోవడం శోచనీయం. రాజధాని నిర్మాణానికి సైతం నిధుల గురించి ప్రస్తావన లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటుచేసిన కేంద్రపాలిన ప్రాంతాలు జమ్మూ కశ్మీర్, లడఖ్‌లపై వరాల జల్లులు కురిపించిన కేంద్రం.. అందులో కనీసం ఒక్క శాతం కూడా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించలేదు. జమ్మూ కశ్మీర్‌కు రూ. 30,757 కోట్లు, లడఖ్‌కు రూ. 5,958 కోట్లు కేటాయిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బెంగళూరు నగరానికి రూ.18,600 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఏపీ రాజధాని ఊసే ఎత్తలేదు. ఈసారి బడ్జెట్లో అయినా రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయని ఆశగా ఎదురుచూసిన జనాలకు కేంద్రం మొండిచెయ్యి చూపింది.తాజాగా ఈ బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ఏపీకి కేంద్రం మొండిచెయ్యి చూపించిందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎదురుచూశామని అయితే బడ్జెట్లో హోదా ప్రస్తావనే లేదన్నారు. వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్ నిరుపయోగమైందని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనడంలో స్పష్టత లేదన్నారు. ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదని, రాష్ట్రాలపై కేంద్రం పక్షపాత ధోరణి చూపించకూడదని విజయసాయి విమర్శించారు.కాగా, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ప్రసంగం తప్ప బడ్జెట్లో ఎలాంటి పసలేదని ఎద్దేవా చేస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. బడ్జెట్ ప్రసంగం చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైనదిగా ఉంది కానీ, తరచి చూస్తే వట్టి డొల్లలాగే ఉందని విమర్శించారు. ఈ బడ్జెట్ లో చెప్పుకోదగ్గ విషయాలేవీ లేవని అన్నారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. యువత ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఉపయోగపడే ఎలాంటి వ్యూహాత్మక ఆలోచనలను బడ్జెట్లో పొందుపరచలేదని