YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం

 పెరిగేవి...తగ్గేవి...

 పెరిగేవి...తగ్గేవి...

 పెరిగేవి...తగ్గేవి...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1, 
బడ్జెట్‌ 2020లో కస్టమ్స్‌ డ్యూటీ పెంపుతో ఫర్నీచర్‌, చెప్పుల ధరలు పెరిగే అవకాశముంది. అదే విధంగా ఎక్సైజ్‌ డ్యూటీ పెంపు నేపథ్యంలో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు కూడా పైకి కదలొచ్చు. అదేవిధంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు, మొబైల్‌ ఫోన్ల విడిభాగాలపై కూడా పన్నులో కోత విధించింది.ఫర్నీచర్‌, దిగుమతి చేసుకునే చెప్పులు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, వైద్య పరికరాలు, కిచెన్‌లో ఉపయోగించే వస్తువులు, క్లే ఐరన్‌, స్టీలు, కాపర్‌, కమర్షియల్‌ వాహనాల విడిభాగాలు, వాల్‌ ఫ్యాన్స్‌, టేబుల్‌వేర్ వంటి వాటి ధరల పెరగొచ్చు.విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్‌ ప్రింట్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, మొబైల్‌ ఫోన్ల విడిభాగాలు, సోయా ఫైబర్‌, సోయా ప్రోటీన్‌, ప్లాస్టిక్‌ ఆధారిత ముడి సరుకు, స్కిమ్డ్‌ మిల్క్‌ వంటి వాటి ధరలు తగ్గొచ్చు.వేతన జీవులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వ్యక్తిగత ఆదాయపన్నును తగ్గించింది. రూ.5 లక్షల్లోపు వార్షిక ఆదాయానికి ఎలాంటి పన్ను లేదని తెలిపింది. వార్షికాదాయం రూ.2.5 లక్షలకు పైబడిన వారికి ఆదాయపన్నుపై రిబేట్ లభిస్తుందని గత బడ్జెట్లోనే ప్రకటించారు. దీన్ని యథాతథంగా కొనసాగించనున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. అల్పాదాయ వర్గాలకు ఊరట ఇవ్వడం కోసం ఆదాయపన్ను శ్లాబులను 4 నుంచి 7కు పెంచారు.గతంలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్నవారు 20 శాతం ఆదాయపన్ను చెల్లించగా.. మారిన శ్లాబుల ప్రకారం రూ.5-7.5 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు ఇక నుంచి 10 శాతం కడితే సరిపోతుంది. రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్నవారు 15 శాతం ఆదాయపన్ను చెల్లిస్తే సరిపోతుంది. గతంలో రూ.10 లక్షలకుపైగా వార్షికాదాయం ఉన్నవారు 30 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది.ఇక నుంచి రూ.10-12.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్నవారు 20 శాతం ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.12.5-15 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారు 25 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.15 లక్షలపైగా వార్షికాదాయం ఉన్నవారు 30 శాతం ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుంది

Related Posts