YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ఏకతాటి మీదికి కూటమి

ఏకతాటి మీదికి కూటమి

ప్రతిపక్షాల ఓట్లు చీలిపోకుండా..
కెసిఆర్‌తో ఢీకి ప్లాన్ ఇదీ
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఎదుర్కోవడానికి సకల జనుల కూటమి కట్టే యోచనలో ప్రతిపక్షాలు ఉన్నాయి. ప్రతిపక్షాలను అన్నింటినీ ఏకతాటి మీదికి తెచ్చి కూటమి ఏర్పాటు చేసేందుకు తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెసు, బిజెపి, తెలంగాణ టిడిపి, వైయస్సా్ కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం వంటి పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధికారం చేపట్టే అవకాశం ఉందనే తలంపుతో ప్రతిపక్షాల ఓట్లు చీలిపోకుండా కూటమి కట్టాలనే ప్రయత్నాలకు కోదండరామ్ తెర తీసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెసు పార్టీని ముందు పెట్టి మహా కూటమి ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని ఎదుర్కోవాలనేది కోదండరామ్ వ్యూహంగా చెబుతున్నారు. కాంగ్రెసు ప్రస్తుతం బలంగా ఉండడం అందుకు కారణంగా చెబుతున్నారు. ప్రతిపక్షాల ఓట్లు చీలిపోకుండా అన్ని పార్టీలను, సంఘాలను, శక్తులను కలుపుకుని పోయి ఓ మహా కూటమిని ఏర్పాటు చేయాలని కోదండరామ్ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, తెలుగుదేశంతో కలిసి నడుస్తున్న బిజెపిని కూటమికి దూరంగా ఉంచాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. పైగా, వామపక్షాలు బిజెపికి వ్యతిరేకంగా ఉన్నాయి. కెసిఆర్‌తో కేంద్ర ప్రభుత్వం సయోధ్యతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, బిజెపితో విడిపోతే టిడిపిని కూడా తమతో కలుపుకుని వెళ్లాలనే ఆలోచనలో కోదండరామ్ ఉన్నట్లు సమాచారం.తన ప్రయత్నాల్లో భాగంగా కోదండరామ్ గద్దర్‌తో కలిసి ఆర్ కృష్ణయ్యతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో శుక్రవారం కోదండరామ్ సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు. కూటమి ఏర్పాటుపై వారి మధ్య చర్చలు సాగినట్లు తెలుస్తోంంది.
 బిజెపితో తెగదెంపులు చేసుకుంటే టిడిపిని తమతో కలుపుకని వెళ్లాలని చర్చల్లో ఓ అభిప్రాయం వచ్చినట్లు సమాచారం. గత ఎన్నికల్లో టిడిపి 15 సీట్లు గెలుచుకోవడం మామూలు విషయమేమీ కాదని వారు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి ఫిరాయించినా టిడిపికి తెలంగాణలో 7 నుంచి 10 శాతం ఓట్లు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో టిడిపిని కలుపుకుని వెళ్లడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ కూడా తెలంగాణలో పోటీ చేస్తానని ప్రకటించారు. అందువల్ల కూటమిలోకి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనను కూడా తేవాలని ప్రాథమికంగా అనుకున్నట్లు తెలుస్తోంది. ఆయనతో చర్చలు జరపాలని అనుకున్నట్లు సమాచారం. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కలుపుకుని వెళ్లడానికి జగన్‌తో కూడా మంతనాలు జరపాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.



 

Related Posts