YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం

 డిపాజిట్లపై భరోసా

 డిపాజిట్లపై భరోసా

 డిపాజిట్లపై భరోసా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 
బ్యాంకులో దాచుకున్న సొమ్ములకు భద్రత ప్రశ్నార్థకమైన తరుణంలో కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న సొమ్ముపై బీమా మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న లక్ష రూపాయల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభలో శనివారం (ఫిబ్రవరి 1) ఉదయం బడ్జెట్ 2020 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని వెల్లడించారు.ఇప్పటి వరకు బ్యాంకులో మనం డిపాజిట్ చేసిన సొమ్ము ఎంత మొత్తం ఉన్నా.. దివాళా తీసే పరిస్థితి వస్తే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ద్వారా లక్ష రూపాయల వరకు మాత్రమే బీమా ఇచ్చేవారు. అయితే.. ఇకపై ఈ ఇన్సూరెన్స్‌ను రూ.5 లక్షల వరకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.అంటే.. ఇకపై ఏవైనా బ్యాంకులకు దివాళా తీసే పరిస్థితి వస్తే రూ.5 లక్షలు, అంతకంటే తక్కువ మొత్తం వరకు డిపాజిట్ చేసిన వారికి ఆ సొమ్మును ప్రభుత్వం అందజేస్తుంది. రూ.5 లక్షల కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసి ఉన్నా సరే.. రూ.5 లక్షలు మాత్రమే వస్తాయన్నమాట.బ్యాంకుల్లో ఫ్రాడ్స్ పెరిగిపోవడం, కొంత మంది బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని కుచ్చుటోపీలు పెడుతున్న ఘటనలు ఎక్కువవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఖాతాదారుల్లో విశ్వాసం కలిగించేదిగా ఉంది. బ్యాంకులో తాము డిపాజిట్ చేసుకున్న సొమ్ము భద్రత విషయంలో నెలకొన్ని ఆందోళనను తొలగించి, కొత్త బడ్జెట్ ఓ భరోసాను ఇచ్చింది.తెలుగు రాష్టాల ప్రజలు భూమిపై, బంగారంపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. విజయ్ మాల్యా ఉదంతం తర్వాత బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. దీంతో బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గుతున్నాయి. డిపాజట్లు పెంచుకోవడానికి పలు బ్యాంకులు టార్గెట్లు కూడా విధించుకున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ తాజా చర్యతో డిపాజిట్లు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం ఎస్‌బీఐలో రూ.2 లక్షల లోపు డిపాజిట్లు 70 శాతం ఉన్నాయి. రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కల్పించడంతో ఈ మొత్తం పెరిగే అవకాశాలున్నాయి.

Related Posts