ఈ గాయత్రి మంత్రం ఎవ్వరైనా జపం చేయవచ్చు..
ఇదే సర్వ గాయత్రి మంత్రం:
"సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాo విద్యాo చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్"
అర్దమ్:
విశ్వవ్యాప్తంగా ఉన్న చైతన్య శక్తి వల్ల ఈ సృష్టిలో చలనం అనేది ఉంటుంది. ఆ శక్తి మూలమైన తల్లి ,"ఆధ్యాo " అన్నిటికి ముందు ఉన్న తల్లి విద్యాస్వరూపమైన తల్లి నిన్ను ధ్యానిస్తున్నాను, మా బుద్దిని నువ్వు ప్రేరేపించు..అని ఈ మంత్రం యొక్క అర్దమ్ .
ఆడవాళ్లు పిల్లలు ఉపదేశం లేని వారు కూడా ఈ మంత్రం జపించవచ్చు.. మరి అది ఇది ఒక్కటే అయినప్పుడు అదే ఎందుకు జపించిన కూడదు అని అనుకుంటారు... ఉన్న ప్రతి అక్షరం మూల బీజం ,ఉపనయనం చేసే వ్యక్తి కొన్ని లక్షల సార్లు మంత్రం జపం చేసిన వారు ఉపదేశం ఇస్తారు అప్పుడే ఆ మంత్రం శక్తి ని ఉపదేశం పొందిన వారు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది, చేయడానికి అరహత ఉంటుంది.
మరి ఆడవాళ్లకు అసలు ఈ గాయత్రి జపం చేయకూడదు అనేది నియమం ఎందుకు పెట్టారు అని కూడా అనుకోవచ్చు , ఈ 24 నాలుగు అక్షరాల గాయత్రి లో "తత్సవితుర్వరేణ్యమ్" ఇందులో "ణ"అనబడే అక్షర శబ్దానికి మన్మథుడు అధిపతి.ఇది పురుష బీజాలకు ములమైనది అది ఆడవాళ్లు పలకడం వల్ల అటువంటి గుణాలు వారిలో కలుగుతుంది.. ఇది ఆలోచించే ఆడవాళ్లకు గాయత్రి ఉపదేశం ఇచ్చేవాళ్ళు కాదు...
అయితే ఇపుడు ఇచ్చిన సర్వ గాయత్రి లో అటువంటివి లేకుండా, అటువంటి ఫలితం పొందే విధంగా ఈ సర్వ గాయత్రి మంత్రాన్ని మన ఋషులు మనకు పర్యాయంగా ఇచ్చారు... ఇది ఉపదేశం తో పని లేకుండా ఎవ్వరైనా, ఆడవాళ్లు మగవాళ్ళు, పిల్లలు అందరూ జపం చేయవచ్చు...
నియమాలు:
మీరు వేరే మంత్రాలకు ఎలాంటి సంకల్పం చెప్పుకుంటారో అలానే అనుష్ఠానం చేయవచ్చు.
యధా శక్తి అని చెప్పుకొని ఎన్ని సార్లు అయినా జపం చేయవచ్చు..
ఈ మంత్రం జపం తో సంధ్యా వందనం చేయాలి అన్న నియమం లేదు..
ఆడవాళ్లు అంటు సమయం వదలి మిగతా రోజుల్లో చేయవచ్చు..