YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఫ్యాషన్ లోనూ...మగ్గం దే కీలకం

ఫ్యాషన్ లోనూ...మగ్గం దే కీలకం

ఫ్యాషన్ లోనూ...మగ్గం దే కీలకం
విజయవాడ, ఫిబ్రవరి 3,
అందంగా కనిపించటం కోసం చేసే సమాయత్తం, అలంకరణ విధానామే ఫ్యాషన్‌. నలుగురి దృష్టిని ఆకర్షించేలా ప్రత్యేకంగా తయారు కావటం ఆడవారికి ఇష్టం. ఫ్యాషన్‌ రంగం రోజురోజుకూ మారిపోతుంది. కట్టు, బొట్టు, అదనపు కుట్టు ఇలా అందంగా కనిపిస్తాయి. చీర, జాకెట్టు, గాగ్ర, గీతాంజలి ఇలా మహిళల వస్త్రధారణ పలు రూపాల్లో ఉంటుంది. ఆడపిల్లలకు అందనిచ్చేవి వస్త్రాభరణాలు. గతంలో వస్త్రాలు, ఆభరణాలు వేర్వేరుగా ఉండేవి. ఇప్పుడు రెండూ ఒకేచోట లభిస్తున్నాయి. పెళ్లికూతురు డ్రెస్‌ అంటే అదో క్రేజ్‌. కిట్టీపార్టీలు, శుభకార్యాలు, గెట్‌ టుగెదర్‌ వంటి ఫంక్షన్లకు మహిళలు ప్రత్యేకంగా తయారు కావటం తెలిసిందే. ఈ ఫ్యాషన్‌లో మగ్గం వర్క్‌ది ప్రత్యేక స్థానం. రిచ్‌లుక్‌ శరీరతత్వానికి తగిన కలర్‌ ఎంపికకు మగ్గం వర్క్‌ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతిచిన్న అలంకరణను చాలా జాగ్రత్తలతో పరిశీలన చేసి ఫంక్షన్‌ కలర్‌ఫుల్‌గా మార్చేది మహిళలే. అసలు మగ్గం వర్కుకు ఎందుకు, మన విజయవాడలో మగ్గం పనికి మంచి ఆదరణ లభిస్తుంది. కొరియర్‌లో క్లాత్‌ పంపించి, డిజైన్‌ను వాట్సప్‌లో తిలకించి వర్క్‌ పూర్తైన తరువాత ఫొటో మేకప్‌లో కనిపిస్తే ఎలా ఉంటుందనే ఊహాచిత్రం పరిశీలించి. ఫ్యాషన్‌గా ఫొటో దిగి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేసి లైక్‌లు ద్వారా అభిప్రాయాలను తెలుసుకుంటున్న పరిస్థితి నేటి యువతది. నగరం లో బీసెంట్‌ రోడ్డులో ఇలా ఆర్డర్స్‌పై మగ్గం వర్క్‌ చేసి దేశ విదేశాల్లో ఉన్న కస్టమర్స్‌కు సేవలు అందించేవారు ఉన్నారు. ఢిల్లీ, ముంబాయి, చెన్నై నుంచి మెటీరియల్స్‌ తీసుకువస్తారు. ఢిల్లీ, బిహార్‌, రాజస్థాన్‌కు చెందిన యువకులు మగ్గం వర్క్‌ చేస్తున్నారు. అయితే వారు చేసి పనికి లభించే వేతనం అంతంతమాత్రమే. కస్టమర్‌ కోరిన విధంగా డిజైన్‌ను కేటలాగ్‌లో లేదా కంప్యూటర్‌లో చూపించి దానికి తగిన మెటీరియల్‌ను సమకూర్చుకుంటాం. స్ప్రింగ్‌, జర్కాన్‌స్టోన్‌, ఫోడా, బ్రైడల్స్‌కు ప్రత్యేకంగా ఈ మెటీరియల్‌ను వాడతాం. థ్రెడ్‌వర్క్‌, మురికుట్లు, లోడింగ్‌, పానీవర్క్‌ చేస్తాం. మిషన్‌ ఎంబ్రాయిడరీకి ఆదరణ తగ్గింది. మగ్గం వర్క్‌పై మక్కువ చూపిస్తున్నారు. శారీరక కొలతలు, నెక్‌, కట్టింగ్‌ వంటి ఖచ్చితంగా తీసుకుని పని చేస్తాం. ఈ పని వివాహాల సమయంలో ఎక్కువగా ఉంటుంది. ఒక్క బ్లౌజ్‌ను తయారు చేయటానికి ఇద్దరు మనుషులు రెండు రోజులు పని చేయాల్సి వస్తుంది. చాలా సున్నితమైన పని. ఎప్పుడూ పని ఉంటే బాగుంటుంది.పట్టుచీర, కుంకుమబొట్టు, పూవ్వులు ఇలా సంప్రదాయ అలంకరణతోనే అందం వస్తుంది. ఫ్యాషన్‌గా వేసే డ్రెస్‌లతో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్ష్‌న్‌గా ఉండవచ్చు గాని ఆత్మీయ భావం ఎక్కువగా ఉండదు

Related Posts