YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

నిర్మాణాల్లో లోపం  ఆస్పత్రికి శాపం

నిర్మాణాల్లో లోపం  ఆస్పత్రికి శాపం

నిర్మాణాల్లో లోపం  ఆస్పత్రికి శాపం
అనంతపురం, ఫిబ్రవరి 3,
రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రి ప్రహరీగోడ, గేట్ల నిర్మాణం సందర్భంగా కాంట్రాక్టర్‌, అధికారుల నిర్లక్ష్యం, లోపం వల్ల ప్రహరీగోడ గేట్లు మూయలేని పరిస్థితి నెలకొంది. రాయదుర్గం ప్రభుత్వాస్పత్రి నూతన భవనాలను రూ.3.25 కోట్ల వ్యయంతో నిర్మించారు. రోడ్ల విస్తరణలో భాగంగా ప్రభుత్వాస్పత్రి ప్రహరీగోడను తొలగించాల్సి రావడంతో సుమారు రూ.8లక్షల వ్యయంతో కొత్తగా ప్రహరీగోడను నిర్మించారు. ఇది వరకు ఆస్పత్రిలోకి ప్రవేశించేందుకు ప్రధాన రహదారిలో కేవలం ఒక ద్వారం మాత్రమే ఉండగా, కొత్త ప్రహరీగోడ నిర్మాణం సందర్భంగా మరో గేటును కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. రోడ్ల విస్తరణలో భాగంగా కొత్తగా సుమారు అడుగు మందంతో సిమెంట్‌ రోడ్డును నిర్మిస్తారని, ప్రభుత్వాస్పత్రి ప్రహరీగోడ నిర్మించేందుకు అనుమతి పొందని కాంట్రాక్టర్‌కు, వాటి పర్యవేక్షించే ఇంజనీర్లకు తెలుసు. అయితే పాత ప్రహరీగోడ ఎలా ఉందో అదే మాదిరిగా ప్రహరీగోడ గేట్లను తక్కువ ఎత్తుతో నిర్మించి ఏర్పాటు చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఆస్పత్రి ప్రహరీగోడ ముందు వైపున కొత్తగా నిర్మించిన మురికి కాలువపై రెండు గేట్ల వద్ద సుమారు అడుగన్నర ఎత్తున వంతెలను నిర్మించారు. ఈ వంతెలపై నుంచి వాహనాలు వచ్చి వెళ్లేందుకు ఇరువైపులా సిమెంట్‌ ర్యాంప్‌ను ఏర్పాటు చేయకపోగా, తాత్కాలికంగా ఇరువైపులా మట్టి వేసి చదును చేశారు. కొత్తగా నిర్మించిన ప్రహరీగోడ గేట్లను రోడ్లు భవనాల శాఖ నిర్మించే రోడ్డు, వంతెన ఎత్తును దృష్టిలో ఉంచుకుని కనీసం అడుగన్నర ఎత్తున గేట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఇవేవీ దృష్టిలో ఉంచుకోకుండా కాంట్రాక్టర్‌ పాత పద్ధతిలోనే తక్కువ ఎత్తులో గేట్లను ఏర్పాటు చేయడం వల్ల వంతెనకు ఇరువైపులా అడుగుకు పైగా ఎత్తున మట్టిని వేయడంతో గేట్లు వేసేందుకు, మూసేందుకు వీలు లేకుండా పోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, ఆస్పత్రి వైద్యాధికారి సదరు ప్రహరీగోడ నిర్మాణం, పర్యవేక్షణను చూసుకునే అధికారులు ఇప్పటికైనా పరిస్థితిని గమనించి ప్రహరీగోడ గేట్లను అవసరమైనప్పుడు మూసేందుకు వీలుగా,అ వసరమైన ఎత్తులో ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Related Posts