YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మోదుగులకు చక్రం తిప్పుతున్నారే

మోదుగులకు చక్రం తిప్పుతున్నారే

మోదుగులకు చక్రం తిప్పుతున్నారే
గుంటూరు , ఫిబ్రవరి 3, )
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా ఓటమిపాలయినప్పటికీ ఆయన హవా మాత్రం తగ్గలేదు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గత ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ సీటు కోరుకోకుండా తనంతట తానే ఎంపీ టిక్కెట్ ను ఆశించారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కోసం గుంటూరు ఎంపీ టిక్కెట్ ను జగన్ సిద్ధం చేశారు.అప్పటి వరకూ అక్కడ ఇన్ ఛార్జిగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలును నరసరావుపేటకు పంపారు. అయితే చిత్రమేంటంటే శ్రీకృష‌్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీగా గెలవగా, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాత్రం గుంటూరు పార్లమెంటు నుంచి ఓటమి పాలయ్యారు. ఎన్నికల సమయంలోనూ మోదుగులపై పార్టీ నుంచి విమర్శలు విన్పించాయి. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆర్థికంగా ఆదుకోలేదన్న ఫిర్యాదులు కూడా మోదుగులపై జగన్ కు అందాయి. అయితే మోదుగుల ఓటమి పాలు కావడంతో పార్టీ ఆ అంశాన్ని అప్పుడే వదిలేసింది.అయితే ఇప్పుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లాలో పెత్తనం చేస్తున్నారన్న టాక్ బలంగా విన్పిస్తుంది. గుంటూరు జిల్లాలో రెడ్డి సామాజికవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తక్కువ. మాచర్ల, గురజాల, నరసరావుపేట, మంగళగిరి మినహా మిగిలిన ప్రాంతాల్లో ఆ సామాజిక వర్గం నుంచి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు లేరు. దీంతో గుంటూరు జిల్లాలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పెత్తనం బాగానే చేస్తున్నారన్న టాక్ విన్సిస్తుంది. ముఖ్యంగా గుంటూరు కార్పొరేషన్ లో ఏ పని జరగాలన్నా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చెప్పనిదే జరగని పరిస్థితి నెలకొంది.దీంతో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా ఇటీవల ఇన్ ఛార్జి మంత్రికి మోదుగులపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ముస్తాఫాతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే విధంగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నారు. సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సయితం మోదుగుల వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అధికారుల బదిలీల నుంచి పోస్టింగ్ ల వరకూ మోదుగుల హ్యాండ్ లేనిదే పని కాదన్న ముద్ర మాత్రం పడిపోయింది. మరి పార్టీ అధిష్టానం మోదుగులకు ఎలా కళ్లెం వేస్తుందో చూడాల్సి ఉంది.

Related Posts