YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

బిల్లుల్లేవ్..(

బిల్లుల్లేవ్..(

బిల్లుల్లేవ్..( పశ్చిమగోదావరి)
ఏలూరు, ఫిబ్రవరి 03 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం గత నెల 21 నుంచి కొత్త ఆహారపట్టికను అమలులోకి తెచ్చింది. దీనికి అయ్యే అదనపు వ్యయాన్ని భరించేందుకు వంట ఏజెన్సీల నిర్వాహకులకు ఇచ్చే మొత్తాలను స్వల్పంగా పెంచింది. నిత్యావసర సరకుల ధరలు నానాటికీ పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం పెంచిన మొత్తంతో కొత్త ఆహార పట్టికను అమలు చేయడం తమకు తలకు మించిన భారమే అవుతుందని వంట కార్మికులు చెబుతున్నారు. మరోపక్క సకాలంలో బిల్లులు చెల్లించక పోవడంతో అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి వడ్డించేందుకు జిల్లా వ్యాప్తంగా సుమారు 6 వేలకు పైగా వంట నిర్వాహకులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి నిర్వాహకులే నెలకు సరిపడా సరకులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. తరువాత బిల్లుల చెల్లింపులు సకాలంలో జరగకపోవడంతో నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్న భోజనం తయారీ కోసం ఒక్కో విద్యార్థికి ప్రాథమిక పాఠశాలల్లో రూ.4.48, ఉన్నత పాఠశాలల్లో 6.71 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. కొత్త మెనూ ప్రకారం ప్రాథమిక స్థాయి విద్యార్థులకు రూ.43 పైసలు, ప్రాథమికోన్న, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 40 పైసల చొప్పున పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు వారంలో మూడు రోజుల పాటు అందాల్సిన 25 గ్రాముల శెనగచెక్క కోసం అదనంగా రూ.3.38 చొప్పున చెల్లించనున్నారు. కొత్త మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం తయారు చేయాలంటే ప్రాథమిక స్థాయి విద్యార్థులకు రూ.12, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ.15 వరకు ఖర్చవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు అందిస్తున్న గౌరవ వేతనాన్ని గతేడాది ఆగస్టు నుంచి రూ.వెయ్యి నుంచి మూడు వేలకు పెంచారు. వీటికి సంబంధించి ఇప్పటి వరకు రూ.4 వేలు మాత్రమే నిర్వాహకుల ఖాతాల్లో జమైంది. ప్రస్తుతం మూడు నెలల బిల్లుల పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి తోడు కొత్త ఆహార పట్టిక అమలుతో తమపై మరింత భారం పడుతుందని భోజన కార్మికులు ఆందోళన చెందుతున్నారు. తమకు చేయూతనిచ్చేలా ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. గ్యాస్‌ సిలిండర్‌, మిక్సీ, గ్రైండర్లను ఉచితంగా అందించాలని కోరుతున్నారు.

Related Posts