YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆటలు తెలంగాణ

రోజుకో మలుపు తిరుగుతున్న ఒలింపిక్ సంఘం ఎన్నికలు

రోజుకో మలుపు తిరుగుతున్న ఒలింపిక్ సంఘం ఎన్నికలు

రోజుకో మలుపు తిరుగుతున్న ఒలింపిక్ సంఘం ఎన్నికలు
హైద్రాబాద్, ఫిబ్రవరి 3,
తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మాజీ ఎంపీ బీజేపీనేత జితేందర్‌రెడ్డి నామినేషన్లు అనూహ్యంగా తిరస్కరించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ముగ్గురు నామినేషన్లు దాఖాలు చేయగా ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. జయేష్ రంజన్ క్యాట్ నుంచి అనుమతి పొందకపోవడంతో ఆయన నామినేషన్ తిరస్కరించారు. అదే విధంగా ఏపీ జితేందర్‌రెడ్డి తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో అధ్యక్షునిగా పోటీచేస్తున్న రంగారావు నామినేషన్ పత్రంపై సంతకం చేసినందుకుగాను నామినేషన్ తిరస్కరించినట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో జయేష్ రంజన్, జితేందర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.గతంలో ఒలింపిక్ అసోసియేషన్ తెలంగాణకు నాయకత్వం వహించిన కే.రంగారావునామినేషన్ స్వీకరించారు. దీంతో అధ్యక్ష పదవీ ఏకగ్రీవం అయిన్నట్లే. రాష్ట్రంలోని వివిధ క్రీడా సంఘాలు, జిల్లా ఒలింపిక్ సంఘాలు కలిసి తెలంగాణ ఒలింపిక్ సంఘం ఏర్పడింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) పర్యవేక్షణలో తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) విధులను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వివిధ క్రీడా సంఘాల మధ్య గత కొంతకాలం నుంచి నెలకొన్న అనిశ్చితికి తెరపడిన్నట్లయింది. రాష్ట్రంలో గత కొంతకాలంగా వివిధ క్రీడా సంఘాల మద్దతుతో టీఓఏ ఏర్పాటైన విషయం తెలసిందే. రాష్ట్రంలో తెలంగాణ ఒలింపిక్ సంఘంకు రెండు సంఘాలు ఏర్పాటు కావడంతో క్రీడాకారులు తీవ్ర ఇక్కట్లకు గురాయ్యరు. అయితే, ఇటీవల తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ), ఒలింపిక్ సంఘం తెలంగాణ (ఓఏటీ) రెండు సంఘాలు ఏకతాటిపైకి వచ్చి నగరంలోని లాల్‌బహదూర్ స్టేడియం ఫతేమైదాన్ క్లబ్‌లో సమావేశం నిర్వహించి ఓకటయ్యాయి. టీఓఏ ఆధ్వర్యంలో అత్యవసర సర్వసభ్య సమావేశం జరిగింది. రెండు సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక ఒలింపిక్ సంఘం ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు.అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికల నిర్వహణ. ఇరు వర్గాల సంఘాల ప్రతినిధులు సమన్వయంతో భారత ఒలింపిక్ సంఘం ఈ ఎన్నికలను నిర్వహిస్తోంది. ఎన్నికల ప్రక్రియాలో భాగంగా ఎన్నికల నిర్వహణ అదికారి హైకోర్టు రిటైర్డు జస్టీస్ చంద్రకుమార్, అసిస్టేంట్ ఎన్నికల అధికారి బీ.అనంత శర్మలు ఎన్నికల ప్రక్రీయకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు.తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికలకు సంబంధించి మొత్తం 57 నామినేషన్లు దాఖాలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో అధ్యక్ష పదవి కోసం మూడు, ప్రధాన కార్యదర్శి కోసం ఇద్దరు, కోశాధికారి కోసం నాలుగు, ఉపాధ్యక్షుని కోసం ఆరుగురు నామినేషన్లు దాఖాలయ్యాయి. అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు వేసిన వారిలో ఎంపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ విభాగం చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ అథ్లెటిక్ సంఘం కార్యదర్శి రంగారావు దాఖాలు చేశారు. అయితే తాజాగా నామినేషన్ల తిరస్కరణ రోజు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మాజీ ఎంపీ ఏపీ.జితేందర్‌రెడ్డి నామినేషన్లు అనూహ్యంగా తిరస్కరించినట్లు ఎన్నికల నిర్వాహణ రిటర్నీంగ్ అధికారి జస్టీస్ బీ.చంద్రకుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ముగ్గురు నామినేషన్లు వేయగా ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. గతంలో ఒలింపిక్ సంఘం తెలంగాణకు నాయకత్వం వహించిన కే.రంగారావు నామినేషన్ స్వీకరించగా, జయేష్ రంజన్ క్యాట్ నుంచి అనుమతి పొందకపోవడంతో ఆయన నామిషన్‌ను తిరస్కరించారు. అసోసియేషన్‌లో కీలక భూమిక నిర్వహంచే ప్రధాన కార్యదర్శి పదవికీ తెలంగాణ కబడ్డి సంఘం కార్యదర్శి కే.జగదీశ్వర్ యాదవ్, తెలంగాణ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు జగన్ మోహన్‌రావు పోటీలో నిలిచారు. కోశాధికారి ఒక పోస్టు కోసం జరిగే ఎన్నికల్లో నాలుగురు కే.మహేశ్వర్, పీ.ప్రకాష్‌రాజు, కుంట ఫణిరావు, ఏ.సోమేశ్వర్‌లున్నారు. 11 మంది కార్యవర్గ సభ్యుల కోసం 22 మంది పోటీ చేస్తున్నారు. రిటర్నీంగ్ అధికారి తెలిపిన విధంగా ఎన్నికలో ఒక వ్యక్తి ఒక పదవీ కోసం పోటీచేయాలని సూచించారు. దీంతో ఎన్నికలో పోటీ చేస్తున్న వారు రెండు పదవులకోసం నామినేషన్లు దాఖాలు చేసిన వారు ఎదైన ఒక పదవీ పోటీ నుంచి విరామించుకునేందుకు విరమించుకోవాల్సి ఉంటుందని, లేకపోతే ఒక వ్యక్తి రెండు పదవుల కోసం పోటీ చేసిన వ్యక్తులు ఉంటే విడ్రా చేసుకోవాలని ఎన్నికల రీటర్నింగ్ అదికారి సూచించారు.ఓఏటీ, టీఓఏ వర్గాల సంఘాల ప్రతినిధులు సమన్వయంతో భారత ఒలింపిక్ సంఘం ఈ ఎన్నికలను ఢిల్లీలో ఫిబ్రవరి 9వ తేదీన నిర్వహించాలని ఖరారు చేసింది. ఎన్నికలను హైదరాబాద్ నగరంలోనే నిర్వహించాలని ఇటీవల ఓ క్రీడా సంఘం కోర్టును ఆశ్రాయించింది. దీంతో ఎన్నికలు ఢిల్లీలోనా లేదా హైదరాబాద్‌లో నిర్వహిస్తారా అనేది ప్రశ్నాగానే మిగిలిపోయింది. ఈ విషయంలో హైకోర్టు ఎన్నికలు నిర్వహించే ప్రాంతాన్ని ఖరారు చేయాల్సి ఉంది.

Related Posts