స్కూలు బస్సు బోల్తా..పది మంది విద్యార్ధులకు స్వల్ప గాయాలు
రంగారెడ్డి ఫిబ్రవరి 3, (
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామ సమీపంలో ఒక స్కూలు బస్సుకు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి గ్రామానికి చెందిన మహాత్మ హైస్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. విహారయాత్రకు వచ్చిన బస్సు తిరిగి వెళ్తుండగా చిలుకూరు గ్రామ సమీపంలో అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ఘటన సమయంలో బస్సులో 66 మంది విద్యార్థులు, ఎనిమిది మంది స్కూల్ సిబ్బంది వున్నారు. సుమారు 10 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. 108 సహాయంతో చిలుకూరు లో ఉన్న శివసాయి ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులందరికి ప్రధమ చికిత్స అందించారు. మిగతా వారందరిని ఆదే స్కూల్లో సురక్షితంగా ఉంచారు. చడం జరిగింది. వారి వారి ఇంటికి క్షేమంగా చేర్పిస్తామని యాజమాన్యం తెలిపింది.