7న మేడారం జాతరకు వెళ్లనున్న సిఎం కేసీఆర్
హైదరాబాద్ ఫిబ్రవరి 3
తెలంగాణ కుంభమేళాగా పేరు పొందిన మేడారం మహా జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 7వ తేదీన వెళుతున్నారు. ఆయన కుటుంబ సమేతంగా వెళ్లి అక్కడ ముక్కులు చెల్లించుకుంటారని తెలిసింది. 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఆయన సమ్మక్క-సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారని ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా సమ్మక్క- సారలమ్మలను దర్శించుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.సిఎం రాక సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తును ఇప్పటికే అధికారులు చేపట్టారు. ఇప్పటికే మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున సమ్మక్క-సారక్కలను దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. లక్షలాది మంది ప్రజలు వనదేవతలను దర్శించుకుని తరిస్తున్నారు. జాతర సందర్భంగా మేడారం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది.