YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన10 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన10 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన10 మంది మృతి
ముంబై ఫెబ్రవరి 3
మహారాష్ట్రలోని జలగావ్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.యావల్‌ తాలుకాలోని హింగోలా గ్రామ సమీపంలో ఎస్‌వీయూ వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు.వీరంతా తమ బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ప్రభాకర్‌ నారాయణ్‌ చౌదరి, ఆయన భార్యతో పాటు 8 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో 10 సంవత్సరాల అమ్మాయి ఉంది.శవాలను పోస్టుమార్టం కు తరలించారు.

Related Posts