YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రద్దులతో ప్రజలకు ఇబ్బందులు తొలగించిన పెన్షన్లను పునర్ధురించాలి

రద్దులతో ప్రజలకు ఇబ్బందులు  తొలగించిన పెన్షన్లను పునర్ధురించాలి

రద్దులతో ప్రజలకు ఇబ్బందులు
          - తొలగించిన పెన్షన్లను పునర్ధురించాలి
- కమిషనర్‌కు వినతి పత్రం అందచేసిన టీడీపీ నాయకులు
రాజమహేంద్రవరం ఫిబ్రవరి 3
జగన్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజలకు ఉపయోగపడే అన్ని సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రజలను ఇబ్బందుకు గురి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక పింఛన్ల విషయంలో చేస్తున్న చేర్పులు, కోతల విషయంలో జగన్‌ ప్రభుత్వం వైఖరి సామాన్యులను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉందన్నారు. నగరంలో అన్యాయయంగా తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ నగరపాలక సంస్థ కమిషనర్‌ను మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), శాప్ మాజీ డైరెక్టర్ యర్ర వేణు తదితరులు స్పందన కార్యక్రమంలో కలిసి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పింఛన్లు పొందేవారి వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించడం ద్వారా కొత్తగా ఆరు లక్షల మందికి పెన్షన్లు కేటాయించారని, ఇదే సమయంలో ఏకంగా ఏడు లక్షల మందికి వివిధ కారణాలతో పెన్షన్లు తొలగించడం సరికాదన్నారు. పింఛను పొందేందుకు నిబంధనల ప్రకారం మీకు అర్హత లేదు... మీ పేర్లు అర్హుల జాబితా నుంచి ఎందుకు తొలగించరాదో చెప్పండి' అంటూ గ్రామ సచివాలయాల్లో నోటీసు బోర్డులు అతికిస్తున్నారని, నిజంగా ప్రజా సంక్షేమం కొరుకునే వారు ఎవ్వరూ అలా చేయరని సూచించారు. పెన్షన్‌ మొత్తం పెంచుతానని హామీ ఇచ్చిన జగన్‌.. దుర్మార్గమైన విధానంలో పెన్షన్లను తొలగించి.. గతంలో లబ్ధిపొందిన వారికి ఆవేదన మిగల్చడం బాధాకరమన్నారు. గత నెల 13వ తేదీన జగన్‌ ప్రభుత్వం తెచ్చిన కొత్త మార్గదర్శకాలతో ఒక్కసారిగా అనర్హులుగా పేర్కొన్నారని, ఇన్నాళ్లూ.. పెన్షన్‌తోనే బతుకు ఈడుస్తున్న వారిపై ఇలా కత్తివేటు వేయడం భావ్యమా అంటూ ప్రశ్నించారు. కుటుంబ ఆదాయ పరిమితి గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ. 12 వేలు అంటూ నిబంధన విధించడం దుర్మార్గమని, చాలా మంది యువకులు ట్రాన్స్‌పోర్టు కింద రిజిస్టర్‌ చేసుకోకుండా సొంత కారు కింద ట్యాక్సీలు నడుపుతూ ఉపాధి పొందుతున్నారని, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు భారీగా టాక్సు చెల్లించలేక ఇలా రిజిస్టర్‌ చేసుకుంటున్నారని, వారినీ సొంత కారు ఓనర్లుగా గుర్తించి.. ఆ కుటుంబంలోని వారికి పెన్షన్లను రద్దు చేయడం సమంజసం కాదన్నారు. ఏడాదిలో ఏ ఒక్క నెలలో విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటినా ఆ కుటుంబంలో పెన్షన్లను కట్‌ చేస్తుండడం ప్రభుత్వం చేస్తున్న ఘోరమైన మోసంగా అభివర్ణించారు. రాష్ట్రంలో పెద్ద పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చారని, అలాంటి గ్రామాల్లోని చాలా మందికి భూములు, ఇళ్లను ప్రాతిపదికగా చేసుకుని పెన్షన్లు తొలగించడం సరైన విధానం కాదన్నారు. వికలాంగులు తప్ప ఒక కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ పెన్షన్లు ఇవ్వరాదని నిర్దేశించడం మాట తప్పడం... మడమ తిప్పడం కాదాని ప్రశ్నించారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి, అంగన్‌ వాడీ వర్కర్లు, వీవోఏలు, ఆశావర్కర్లు సహా చాలా మంది వేతనాలను ప్రభుత్వం రూ. 10 వేలకు పెంచిందని, ఇప్పుడు అలాంటి వారి ఆదాయం రూ.12వేలు ఉందంటూ పెన్షన్లు తొలగిస్తుండడం ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమన్నారు. అందువల్ల పెన్షన్ల కోత విషయంలో ప్రభుత్వం తీసుకునివచ్చిన కొత్త నిబంధనలను వెంటనే సడలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశి నవీన్, నగర టిడిపి అధ్యక్షుడు వాసిరెడ్డి రాంబాబు, మాజీ కార్పొరేటర్లు కురగంటి సతీష్, ఇన్నమురి రాంబాబు, తంగెల బాబీ, మర్రి దుర్గ శ్రీనివాస్, సింహా నాగమణి, కడలి రామకృష్ణ, మాటూరి రంగారావు, బెజవాడ రాజకుమార్, నాయకులు మజ్జి రాంబాబు, మల్ల వెంకటారాజు, పెనుగొండ రామకృష్ణ, జాలా మదన్, శీలం గోవింద్, మాటూరి సిద్ధు, పితాని కుటుంబ రావు, బేసరి చిన్ని, గరగ మురళి, కంటిపూడి రాజేంద్రప్రసాద్, చాపల రాజు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పెన్షన్లు కోల్పోయిన వారు పాల్గొన్నారు.

Related Posts