హైదరాబాద్-పూనె డైరెక్ట్ ఫ్లైట్లు ప్రకటించిన గో ఎయిర్
ఫిబ్రవరి 5 నుండి ప్రతిరోజూ(శనివారాలు మినహా) నాన్ స్టాప్ విమానాలు ప్రారంభం
ప్రారంభం సందర్భంగా పరిచయ రిటర్న్ టిక్కెట్ ధరలు రూ.4850 లుమాత్రమే
హైదరాబాద్ ఫిబ్రవరి 3
ఆసియాలో అత్యంత విశ్వసనీయమైన, సమయపాలన కలిగిన మరియు వేగంగా వృద్ధిచెందుతున్న ఎయిర్‌లైన్ గో ఎయిర్, హైదరాబాద్ నుండి పూనెకు రాకపోకలు సాగించేందుకు అనుదిన(శనివారాలు మినహా) నాన్ స్టాప్ విమానాలను ప్రకటించింది. హైదరాబాద్ – పూనె – హైదరాబాద్ మార్గంలో నడిచే క్రొత్త విమానాలు ఫిబ్రవరి 5, 2020 నుండి ప్రారంభం కానున్నాయి. ఉన్నత వారసత్వ సంపదకు, నిత్యము పెరుగుతూ ఉన్న వ్యాపార కార్యక్రమాలు మరియు ఐటి పరిశ్రమలకు ఈ రెండు నగరాలు పెట్టింది పేరుగా ఉన్నాయి. వ్యాపార మరియు విహార ప్రయాణీకులకు గో ఎయిర్ ప్రారంభిస్తున్న క్రొత్త ఫ్లైట్లు ఉత్తమ ప్రయాణ సదుపాయాన్ని అందిస్తాయి. ప్రారంభం సందర్భంగా అందిస్తున్న పరిచయ ధర తక్కువగా రూ. 4,850 గా ఉంది. పూనే నుండి అహ్మదాబాద్, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా మరియు నాగపూర్‌ల మధ్య గో ఎయిర్ అద్భుతమైన ప్రయాణ సంధాయకతను అందిస్తుంది. యుఎస్ ఆధారిత ఏపెక్స్ సర్వేలో 1.4 మిలియన్ల ప్రయాణీకుల నుండి నాలుగుకు నాలుగు స్టార్లు రేటింగ్ సాధించిన ఈ ఎయిర్లైన్ హైదరాబాద్ నుండి అహ్మదాబాద్, బెంగుళూరు, చండీఘర్, చెన్నై, ఢిల్లీ, గోవా, జైపూర్, కానూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో మరియు పాట్నాలకు విమానాలు నడుపుతుంది. 2005 లో ఇది ప్రారంభమైనప్పటి నుండి, ఈ ఎయిర్లైన్ 80 మిలియన్ల ప్రయాణీకులను వారి గమ్యాలకు చేర్చి ప్రస్తుతం అహ్మదాబాద్, ఐజ్వాల్, బాగ్దోగ్రా, బెంగుళూరు, భువనేశ్వర్, చండీఘర్, చెన్నై, ఢిల్లీ, గోవా, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, జమ్ము, కొచ్చి, కోల్‌కతా, కానూర్, లేహ్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పాట్నా, పోర్ట్ బ్లెయిర్, పూనే, రాంచీ, శ్రీనగర్, వారణాసి, ఫుకెట్, మాలే, మస్కట్, అబుదబి, దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్, కువైట్, మరియు డామం అనే 27 దేశీయ మరియు 9 అంతర్జాతీయ గమ్యస్థానాలతో కలిపి మొత్తం 36 నగరాలకు తమ సేవలను అందిస్తుంది. గో ఎయిర్ విమానం హైదరాబాద్‌లో 11:05 గంటలకు బయలుదేరి పూనెకు 12:25 గంటలకు చేరుతుంది. రిటర్న్ ఫ్లైట్ పూనేనుండి 13:00 గంటలకు బయలుదేరి హైదరాబాదుకు 14:20 గంటలకు చేరుకుంటుంది. సేల్స్ విండో సేవలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి, ఇక ప్రయాణీకులు గో ఎయిర్ మొబైల్ యాప్ మరియు గోఎయిర్ ఎయిర్‌పోర్ట్ కౌంటర్ల వద్ద టికెట్లు బుక్ చేసుకోవచ్చు.