జీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: నామా డిమాండ్
న్యూఢిల్లీ ఫిబ్రవరి 3
లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా నామా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. రూ. 5 వేల కోట్ల జీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రధాని, కేంద్ర మంత్రులకు లేఖలు రాసినా స్పందన లేదని నామా నాగేశ్వర్‌రావు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది అని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిలు ఆలస్యం కావడంతో పథకాల అమలుకు ఆటంకం కలుగుతుందన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి. గందరగోళం మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. లోక్‌సభలో సీఏఏ, ఎన్నార్సీపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సేవ్ ఇండియా - సేవ్ డెమోక్రసీ అంటూ విపక్షాలు నినాదాలు చేస్తున్నాయి.