YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేటీఆర్‌ "తెలంగాణ నయా గజని": బీజేపీ లక్ష్మణ్

కేటీఆర్‌ "తెలంగాణ నయా గజని": బీజేపీ లక్ష్మణ్

కేటీఆర్‌ "తెలంగాణ నయా గజని": బీజేపీ లక్ష్మణ్
హైదరాబాద్  ఫిబ్రవరి 3 br />   కేంద్రం, బీజేపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కౌంటరిచ్చారు. మంత్రి కేటీఆర్‌ను "తెలంగాణ నయా గజని"గా అభివర్ణించారు. ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు చేసిన సాయంపై మంత్రి కేటీఆర్‌తో చర్చకు సిద్ధమన్నారు. నయా గజని .‌. కేంద్ర సాయాన్ని మర్చిపోవటం సాధారణమేనని, హైదరాబాద్ రోడ్లను బాగుచేయలేనివారు.. కేంద్రంపై విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు. కేకే‌.. ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడన్న విషయం‌ తెలంగాణ గజని కేటీఆర్‌కు గుర్తులేదా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. సిరిసిల్లలో స్వతంత్ర్య అభ్యర్థులను గుంజుకున్న చరిత్ర కేటీఆర్‌దని, రాజ్యసభ్యుడితో దొంగ ఓటు వేయించటం టీఆర్ఎస్‌కే చెల్లిందన్నారు. నిజామాబాద్ మేయర్ ‌‌సహా.. తుక్కుగూడ, నేరేచుచర్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో టీఆర్ఎస్ నిజాయతీ ఏపాటితో తేలిపోయిందన్నారు. తమ‌ అవినీతి బయటపడుతుందనే.. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వటం లేదని విమర్శించారు. డీపీఆర్ ఇవ్వకుండా.. పోలవరానికి జాతీయహోదా ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ‘ఢిల్లీలో కాళ్ళు.. తెలంగాణలో కన్నీళ్ళు’ తెలంగాణ గజనీకి అలవాటేనని అన్నారు. నీటి ప్రాజక్టులకు కేంద్రమిచ్చిన అనుమతుల గురించి తన బావ హరీష్‌నడిగి కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా.. అప్పటి ఏపీకి ఎన్ని నిధులిచ్చారో కేటీఆర్ చెప్పాలన్నారు. ఆదాయ వనరులు పెంచుకోకుండా.. కేంద్రం మీద నెపం వేయటం చేతకాని తనమేనన్నారు. కేంద్ర పథకాలకు పేరు మార్చి ప్రచారం చేసుకుంటున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని లక్ష్మణ్ విమర్శించారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు కొనసాగుతున్నాయి.

Related Posts