తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు: ఈటల
హైదరాబాద్ ఫిబ్రవరి 3
;: గాంధీ ఆస్పత్రిలో వైరాలజీ ల్యాబ్‌ను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. నేడు గాంధీ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదన్నారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. నిన్నటి వరకు జరిపిన టెస్టుల శాంపిల్స్‌ను పుణెకు పంపించామన్నారు. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారని మంత్రి ఈటల వెల్లడించారు.