YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తొలగించిన పింఛన్లను,రేషన్ కార్డులను వెంటనే కొనసాగించాలి

తొలగించిన పింఛన్లను,రేషన్ కార్డులను వెంటనే కొనసాగించాలి

తొలగించిన పింఛన్లను,రేషన్ కార్డులను వెంటనే కొనసాగించాలి
తుగ్గలి  ఫిబ్రవరి 3
తుగ్గలి మండలంలో ప్రభుత్వం తొలగించిన వృద్ధాప్య, వితంతు,వికలాంగుల పింఛన్లను మరియు రేషన్ కార్డులను యధావిధిగా కొనసాగించాలని సిపిఐ నాయకులు ర్యాలీ నిర్వహించి తుగ్గలి ఎంపీడీవో కార్యాలయంలో ముట్టడించారు. మండల కేంద్రమైన దగ్గరిలోని స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయాన్ని ముట్టడించారు.ఈ కార్యక్రమంలో భాగంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా వివిధ సర్వేలలో చేపట్టి మండలంలో పింఛన్లను మరియు రేషన్ కార్డులను తొలగిస్తున్నారని వారు తెలియజేశారు.తుగ్గలి మండల పరిధిలో మొత్తంగా దాదాపుగా ఎనిమిది వందల పైచిలుకు పింఛన్లను తొలగించినట్టు వారు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలగించిన పింఛన్లను మరియు రేషన్ కార్డులను వెంటనే పునరుద్ధరించాలని సిపిఐ నాయకులు ఇన్చార్జి ఎంపీడీవో వీర రాజుకు మెమోరాండం అందజేశారు.దీనిపై ఎంపీడీవో మాట్లాడుతూ తొలగించిన రేషన్ కార్డు లను మరియు పింఛన్లను యధావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నబి రసూల్,సిపిఐ జిల్లా సమితి సభ్యుడు గురుదాస్,మండల కార్యదర్శి రోళ్ళపాడు వెంకటేష్,సుల్తాన్,మాబు పీర మరియు ఏఐటియుసి నాయకులు మరియు సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 

Related Posts