రఘనందన్ రావుపై లైంగిక ఆరోపణలు
హైద్రాబాద్, ఫిబ్రవరి 3
బీజేపీ నేత ఎం రఘునందన్ రావు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రాష్ట్ర మానవ హక్కుల సంఘంని కలిసినట్లు బాధితురాలు పేర్కొన్నారు. సోమవారం ఉదయం సీపీ సజ్జనార్‌ను కలిసిన బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన రఘునందన్ రావు తెలంగాణ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. తరచూ టీవీ చర్చల్లో పాల్గొనే ఆయన రాష్ట్రవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి నేతపై లైంగిక ఆరోపణలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.