YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సస్పెన్ష్ థ్రిల్లర్ సినిమాలా 3 రాజధానుల వ్యవహారం

సస్పెన్ష్ థ్రిల్లర్ సినిమాలా 3 రాజధానుల వ్యవహారం

సస్పెన్ష్ థ్రిల్లర్ సినిమాలా 3 రాజధానుల వ్యవహారం
విజయవాడ, ఫిబ్రవరి 3
మూడు రాజధానుల వ్యవహారం సస్పెన్ష్ థ్రిల్లర్ సినిమాలా మారింది. ఓవైపు హైకోర్టులో పిటిషన్లు నడుస్తుండగానే.. ముఖ్యమంత్రి జగన్ దూకుడు పెంచారు. ఏపీ విజిలెన్స్‌ కమిషనర్‌ కార్యాలయం, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుల కార్యాలయాల్ని కర్నూలుకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. మళ్లీ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు.ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆఫీసుల్ని కర్నూలుకు తరలించడాన్ని సవాల్ చేస్తూ కొంతమంది రైతులు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. సర్కార్ తీసుకొచ్చిన జీవో నెం.13 చట్ట విరుద్ధమని.. విచారణ జరపాలని కోరారు. దీనిపై మంగళవారం విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్‌లో ప్రభుత్వంతో పాటూ సీఆర్డీఏ చైర్మన్‌, సీఆర్డీఏను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు.ఏపీ విజిలెన్స్‌ కమిషనర్‌ కార్యాలయం, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుల కార్యాలయాల్ని తరలిస్తూ గత శనివారం ప్రభుత్వం జీవో ఇచ్చింది. ప్రస్తుతం ఈ కార్యాలయాలు గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యాలయాలను తక్షణమే కర్నూలు తరలిచండం కోసం తగిన భవనాలను గుర్తించాలని ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్, కర్నూలు జిల్లా కలెక్టర్లను జగన్ సర్కారు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Related Posts