YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఆస్ట్రేలియాలో పట్టపగలే చీకటి

ఆస్ట్రేలియాలో పట్టపగలే చీకటి

ఆస్ట్రేలియాలో పట్టపగలే చీకటి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3
ఆస్ట్రేలియాలో క్షణాల్లో వాతావరణం మారిపోయింది. పట్టపగలే చీకట్లు అలముకున్నాయి. ఇదేదో మబ్బులు ముసరడం వల్ల జరిగి ఉంటుందని అనుకుంటే పొరపాటే. వాతావరణం ఇలా మారడానికి కారణం.. కార్చిచ్చు. ఇటీవల ఆస్ట్రేలియాను అతలాకుతలం చేసిన ఆ కార్చిచ్చు ప్రభావంతో ఈ పరిస్థితి ఏర్పడింది.ఆస్ట్రేలియా అడవులను చుట్టుముట్టిన కార్చిచ్చు భారీ వృక్షాలతోపాటు కోట్లాది వన్యప్రాణులు కాలి బూడిదవుతున్నాయి. ఈ కార్చిచ్చు ప్రభావం వాతావరణం మీద కూడా పడింది. దట్టమైన పొగ ఆకాశాన్ని కప్పేయడంతో సూర్యరశ్మి సైతం నేలను తాకడం లేదు. ఫలితంగా అక్కడ పట్టపగలే చీకట్లు అలముకుంటున్నాయి. ముఖ్యంగా ఈ కార్చిచ్చు రేగిన అటవీ ప్రాంతాలు చీకటిగా మారుతున్నాయి.అక్కడి భయానక పరిస్థితిని తెలియజెబుతూ డన్మోర్ అగ్మిమాపక శాఖ ఇటీవల తమ ఫేస్‌బుక్ పేజీలో ఓ వీడియోను పోస్టు చేసింది. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది ముప్పును ముందే గ్రహించారు. క్రమేనా చీకటిగా మారుతున్న వాతావారణాన్ని చూసి మంటలు తమను మీదకు వచ్చే ప్రమాదం ఉందని భావించారు. ఆ వెంటనే తమ వాహనాలతో హుటాహుటిన అక్కడి నుంచి బయల్దేరారు. అయితే, ఒక అగ్నిమాపక వాహనాన్ని మాత్రం అక్కడే వదిలేశారు.ఆ వాహనంలో ఉన్న కెమేరా అక్కడి దావాగ్ని బీభత్సాన్ని రికార్డు చేసింది. నల్లని పొగ వచ్చిన క్షణాల్లోనే మంటలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అవి అగ్నిమాపక వాహనాన్ని సైతం కాల్చేశాయి. అయితే, ఆ వాహనంలో ఉన్న కెమేరా మాత్రం చెక్కు చెదరకుండా ఇదంతా రికార్డు చేయడం గమనార్హం.ఇప్పటివరకు ఈ వీడియోను 1.5 మిలియన్ మంది వీక్షించారు. 22 వేల మందికి పైగా షేర్ చేసుకున్నారు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. కార్చిచ్చు ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది.

Related Posts