YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 కత్తిపోట్లకు దారితీసిన ఆటో పార్కింగ్

 కత్తిపోట్లకు దారితీసిన ఆటో పార్కింగ్

 కత్తిపోట్లకు దారితీసిన ఆటో పార్కింగ్
అనంతపురం ఫిబ్రవరి 3
అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట గ్రామంలో ఓ వ్యక్తి వేటకొడవలితో దాడి చెయ్యడం కలకలం రేపింది. సుధాకర్ కి సురేష్ కి మద్య చెలరేగిన వివాదం కోట్లాటకు దారి తీసింది. సురేష్ తన ఆటోను సుధాకర్ ఇంటి ముందు పెట్టడంతో వివాదం చోటు చేసుకుంది. అది కాస్తా కోట్లాటకు దారి తియ్యడంతో ఒకరిపై ఒకరు పరస్పరం వాగ్వాదం చేసుకున్నారు.మద్యం మత్తులో ఉన్న సుధాకర్ ఆగ్రహంతో వేట కొడవలితో సురేష్ పై దాడి దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సురేష్ ల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు తరలించారు. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts