YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గన్నవరం రచ్చ మూములుగా లేదుగా

గన్నవరం రచ్చ మూములుగా లేదుగా

గన్నవరం రచ్చ మూములుగా లేదుగా
విజయవాడ, ఫిబ్రవరి 4,
కృష్ణాజిల్లా గ‌న్నవ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య అసంతృప్తి రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ హ‌వా జోరుగా సాగిన‌ప్పటికీ గ‌న్నవ‌రంలో మాత్రం టీడీపీ నాయ‌కుడు వ‌ల్లభ‌నేని వంశీ రెండోసారి కూడా విజ‌యం సాధించారు. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన యార్లగ‌డ్డ వెంక‌ట్రావు ప‌రాజ‌యం పాల‌య్యారు. అయితే, నాలుగు నెల‌లు తిరిగే స‌రికి వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేయ‌డం, వైసీపీకి అనుకూల‌మ‌ని ప్రక‌టించ‌డం, జ‌గ‌న్ ప‌థ‌కాల‌కు తాను ఆక‌ర్షితుడిన‌య్యాన‌ని చెప్పడం వంటివి అప్పట్లో సంచ‌ల‌నం సృష్టించాయి.అయితే, ఇక్కడ వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న యార్లగ‌డ్డ వెంకట్రావు వల్లభనేని వంశీ రాక‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా కూడా పార్టీ అధినేత జ‌గ‌న్ ఇద్దరినీ పిలిపించుకుని వారితో చ‌ర్చించారు. క‌లిసి ప‌నిచేయాల‌ని హిత‌వు ప‌లికారు. యార్లగ‌డ్డకు ఖ‌చ్చితంగా పార్టీలో త‌గిన విధంగా గుర్తింపు ఉంటుంద‌ని చెప్పారు. వెంక‌ట్రావుకు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చిన‌ట్టు ప్రచారం జ‌రిగింది. ఆ త‌ర్వాత వెంక‌ట్రావుకు కేడీసీసీబీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య విభేదాలు త‌గ్గుతాయ‌ని అంద‌రూ అనుకున్నారు.అయితే, తెర‌మీద మాత్రం ఈ నేత‌ల మ‌ధ్య విభేదాలు ఎక్కడా క‌నిపించ‌డం లేదు. ఎవ‌రికి వారు సైలెంట్‌గా ప‌నిచేస్తున్నారు. కానీ, తెర‌చాటున మాత్రం యార్లగడ్డ ఇప్పటికీ వల్లభనేని వంశీపై విమ‌ర్శలు చేస్తూనే ఉన్నార‌ని స‌మాచారం. వైసీపీని గ‌తంలో దారుణంగా తిట్టిన నాయ‌కుడిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటార‌ని యార్లగ‌డ్డ అంటున్నా ర‌ట‌. అంతేకాదు, త్వర‌లోనే స్థానిక సంస్థల ఎన్నిక‌లు తెర‌మీదికి రానున్నాయ‌ని, ఇప్పుడు పార్టీ త‌ర‌ఫున వల్లభనేని వంశీ ఏమ‌న్నా ప్రజ‌ల మ‌ధ్య తిరిగే ధైర్యం చేయ‌గ‌ల‌డా? అని స‌వాలు కూడా విసురుతున్నార‌ని స‌మాచారం.మ‌రోప‌క్క, తాను వైసీపీ విధానాల‌కు అనుకూల‌మేన‌ని వల్లభనేని వంశీ చెప్పినా ఆ పార్టీ నేత‌ల‌కు, వంశీకి మ‌ధ్య ఇప్పటి వ‌ర‌కు స‌ఖ్యత కుద‌ర‌లేద‌ని తెలుస్తోంది. వల్లభనేని వంశీ టీడీపీని వీడిన‌ట్టు చెబుతున్నా ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం మాత్రం ఇంకా తాము టీడీపీలోనే ఉన్నామ‌ని బ‌హిరంగ వ్యాఖ్యలు చేస్తోంది. దీంతో వైసీపీ నేత‌లు.. ఈయ‌న‌తో మేం ప‌డ‌లేమనే వ్యాఖ్యల‌ను బాహాటంగానే చేస్తున్నార‌ట‌. మ‌రి ఈ నేప‌థ్యంలో స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో వల్లభనేని వంశీ ఎలాంటి పాత్ర పోషిస్తారో ? ఈ ఎన్నిక‌ల్లో పార్టీ అధిష్టానం ఏ వ‌ర్గానికి ప్రయార్టీ ఇస్తుందో ? చూడాలి.

Related Posts