YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 భయపడుతున్న సీఎస్ లు

 భయపడుతున్న సీఎస్ లు

 భయపడుతున్న సీఎస్ లు
విజయవాడ, ఫిబ్రవరి 4,
ఏపీ సీఎం జగన్ దూకుడుగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల మూలంగా అధికారులు బెంబేలెత్తుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఏపీలో జగన్ ఎనిమిది నెలల పాలనలో ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బయటకు వెళ్ళిపోయారు. జగన్ తో దోస్తీ చేసినట్లుగా మొదట్లో కనిపించిన ఎల్వీ సుబ్రమణ్యం ఇపుడు ఏమీ కాకుండా పదవీ విరమణ చేయబోతున్నారు. దానికి కారణం జగన్ తో ఆయకు విధానపరమైన నిర్ణయాలలో వచ్చిన విభేదాలుగా చెప్పుకుంటారు. ఆయన స్థానంలో కేంద్ర సర్వీసుల నుంచి తెచ్చి పెట్టుకున్న ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సహానీ కధ కూడా అచ్చం అలాగే ఉందిట. ఆమె సైతం జగన్ స్పీడ్ ని చూసి ఇలా అయితే ఎలా అన్న తీరున ఆందోళనలో ఉన్నారని చెబుతున్నారు.ఏపీలో ఇపుడు హాట్ టాపిక్ గా మూడు రాజధానుల కధ ఉంది. జగన్ కి ఎలాగైనా విశాఖను పాలనా రాజధానిగా చేసి తాను అక్కడికి పెట్టే బేడా సర్దుకుని తొందరగా వెళ్ళాలని ఉంది. అయితే దీనికి సంబంధించిన బిల్లు సగంలోనే ఆగింది. మండలి రద్దు బిల్లు కేంద్రానికి వెళ్ళింది. సెలెక్ట్ కమిటీ కధ కూడా ఇంకా తేలలేదు. ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా కర్నూలు కి కొన్ని ప్రభుత్వ ఆఫీసులను తరలిస్తూ జగన్ ఓ అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజధాని కేసు ఇపుడు హైకోర్టులో ఉన్న వేళ యధాతధ పరిస్థితిని విధిస్తూ తీర్పుని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కర్నూలుకి ప్రభుత్వ ఆఫీసుల తరలింపు నిర్ణయం ఎక్కడ తమకు చుట్టుకుంటుందోనని అధికారులు హడలిపోతున్నారుట.ఇక రాజధాని కేసు హైకోర్టులో ఉందని, ఈ సమయంలో ఒక్క ఇటుక అయినా అమరావతి నుంచి కదిలినా బాధ్యత మొత్తం అధికార యంత్రాంగానిదేన‌ని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని అంటున్నారు. ఓ విధంగా తీర్పు వచ్చేవరకూ మూడు రాజధానుల కధ ముందుకు సాగదు. హై కోర్టు లో విచారణ సాగాలంటే మండలి నిర్ణయం ముఖ్యం. అక్కడ ఇంకా సెలెక్ట్ కమిటీయే ఏర్పాటు కాలేదు. ఇలా ఎన్నో చిక్కుముడులతో మూడు రాజధానుల వ్యవహారం ఉంది. మరి హఠాత్తుగా జగన్ సర్కారు కర్నూలుకి కొన్ని న్యాయ పాలనా కార్యాలయాలు తరలించాలని చూడడం న్యయ పరిధిలోకి వస్తుందా అన్న చర్చ కూడా మొదలైంది.ఈ పరిణామాలన్నీ చూస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ దీర్ఘకాలిక సెలవులోకి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు. ఎటునుంచి ఎటు కధ సాగినా తమకే ఇబ్బంది అవుతుందని ఆమె భావిస్తున్నారని అంటున్నారు. ఓ వైపు ప్రభుత్వం చెప్పినట్లుగా చేయాలి. అక్కడ రెండవ మాటకు తావు లేదు, అదే సమయంలో కోర్టు ఆదేశాలూ పాటించాలి. మరి ఈ రెండింటి మధ్యన నలిగిపోయి ఇబ్బందులు పాలు కావడం కంటే సెలవు పెట్టేస్తే సరి అన్నట్లుగా నీలం సహానీ ఆలోచిసున్నారని అంటున్నారు. ఆమె ఈ ఏడాది జూన్ వరకే పదవిలో ఉంటారు. అంటే తన రిటైర్మెంట్ వరకూ సెలవు పెట్టేస్తే ఏ గొడవలూ లేకుండా బయటపడవచ్చు అన్నది ఆలోచనగా చెబుతున్నారు. ఆమె కనుక ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటే మాత్రం జగన్ సర్కార్ ఏర్పడిన తరువాత ఇద్దరు ప్రధాన కార్యదర్శులు కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే తప్పుకున్నట్ల వుతుంది. అది ప్రభుత్వానికి చెడ్డ పేరుని తెస్తుంది. విపక్షానికి కొత్త అస్త్రాన్ని అందిస్తుంది. మరి జగన్ తన దూకుడు తగ్గించుకుంటారా..? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts