YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

యదేఛ్చగా అక్రమ వెంచర్లు

యదేఛ్చగా అక్రమ వెంచర్లు

యదేఛ్చగా అక్రమ వెంచర్లు
గుంటూరు, ఫిబ్రవరి 4,
దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలని సామెత.. అక్షరాల పాటిస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.  త్వరలో సీఆర్డీఏ రద్దు చేస్తారనే ప్రచారంతో  ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. సిఆర్‌డిఎ అనుమతులు లేకుండానే మండలంలో వెంచర్లు వేసి యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. దీని వల్ల ప్లాట్లు కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. రాష్ట్ర రాజధాని అమరావతికి జి.కొండూరు మండలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మెట్టప్రాంతం కావడంతో పారిశ్రామికవేత్తల చూపు కూడా ఇటువైపే ఉంది. ఇబ్రహీంపట్నంలోని కొండపల్లి పారిశ్రామికవాడ జి.కొండూరు సరిహద్దు గ్రామమైన కట్టుబడిపాలెం పక్కనే ఉంటుంది. జి.కొండూరు శివారు కొత్తూరు వద్ద సుమారు 50 ఎకరాల భూమిని పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం అప్పగించారు. ఫెర్రీలోని పవిత్ర సంగమం వద్ద ఐకానిక్ బ్రిడ్జి పూర్తయితే ఇక్కడ భూముల ధరలు మరింతగా చుక్కలనంటుతాయి. ఇదంతా ఒక ఎత్తయితే ఇబ్రహీంపట్నం నుంచి జి.కొండూరు వరకూ నాలుగు లైన్ల రహదారి వేశారు. జి.కొండూరు నుంచి చెవుటూరుకు బైపాస్ నిర్మించారు. ఈ పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ మాఫియా కన్ను జి.కొండూరు మండలంపై పడింది. రైతుల దగ్గర నుంచి తక్కువ ధరలకు భూములను కొని, నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు విడగొట్టి అమ్ముతున్నారు. రైతుల్లో కూడా బాగా అప్పుల్లో ఉన్న వారిని ఏరి పట్టుకుని అయిన కాడికి తక్కువ ధరకు భూమిని కొంటున్నారు. గ్రామపంచాయితీ పరిధిలో అయితే పంచాయితీ అప్రూవల్ తీసుకోవాలి. జి.కొండూరు మండలం ప్రస్తుతానికి సిఆర్‌డిఎ పరిధిలో ఉంది. ఎవరైనా వ్యవసాయ భూమిలో ఎవరైనా వెంచర్లు వేయాలనుకుంటే ముందుగా వ్యవసాయేతర భూమిగా మార్పు చేయించాలి. వెంచరు వేయాలంటే రహదారులు 40 అడుగులు తీసి, కామన్ సైటును విడగొట్టి, అన్ని వౌలిక వసతులు కల్పించాలి. సిఆర్‌డిఎ అనుమతి తీసుకోవాలి. కానీ ఇటీవల జి.కొండూరు మండలంలో అనధికార లేఅవుట్‌లు ఎక్కువయ్యాయి. ధనార్జనే ధ్యేయంగా రియల్ ఎస్టేట్ మాఫియా పడగ విప్పుతోంది. అయిన కాడికి తక్కువకు కొనటం, ఫ్లాట్లను ఆన్‌లైన్‌లో చూపించి అమ్మేస్తున్నారు. జనావాసాలకు దూరంగా అటవీ ప్రాంతానికి దగ్గర్లో కూడా ప్లాట్లను వేస్తున్నారు. నిబంధనలు తెలియని అమాయకపు జనం ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. రియల్ మాఫియాలో నల్లధనమే అధికంగా చేతులు మారుతోంది. సిఆర్‌డిఎ అప్రూవల్ లేకుండా ఇళ్ళు కట్టుకుంటే భవిష్యత్తులో వాటిని కూల్చి వేసే అవకాశం లేకపోలేదు. రిజిస్ట్రేషన్ కాని భూములకు సర్వే నెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. అసైన్డ్ భూములు, చెరువుల భూములకు గ్రామకంఠం సర్వే నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. కొన్ని రిజిస్ట్రేషన్లను వీలునామాలు సృష్టించి చేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ భూములను కూడా వెంచర్లలో కలిపేసుకుని ప్లాట్లుగా మార్చి ప్రజలను ఏమారుస్తున్నారు. ఇటువంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలువురు

Related Posts