YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 జగన్ మౌనమంత్రం...

 జగన్ మౌనమంత్రం...

 జగన్ మౌనమంత్రం...
విజయవాడ, ఫిబ్రవరి 4,
రాజకీయాల్లో నమ్మకం ముఖ్యం. అది జగన్ పదే పదే అంటారు. ఆయన దగ్గరనే ఇప్పటితరం నాయకులు విశ్వసనీయత వంటి వాటి గురించి నేర్చుకోవాలి. అయితే జగన్ కొన్ని విషయాల్లో మాత్రం రాజీ పడుతున్నట్లుగా ఉందని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో జగన్ కేంద్రాన్ని నిలదీయకపోవడం, విభజన హామీలపైన, ఏపీకి పెద్ద ఎత్తున వచ్చే కేంద్ర నిధుల పైనా పట్టుబట్టకపోవడం వంటివి సొంత పార్టీలోనే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయిట. ఇక జగన్ కి కొత్త మిత్రులుగా ఉన్న వారు సైతం తాజా పోకడల పట్ల అసంతృప్తి గా ఉన్నారట.కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకూ తీరని అన్యాయం చేసింది. ఇందులో రెండో మాటకు అవకాశమే లేదు. అయితే ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీసేందుకు టీఆర్ఎస్ రెడీగా ఉంది. అదే సమయంలో వైసీపీ ఎంపీలు నంగి నంగి మాటలు చెబుతున్నారు. అవును..అన్యాయమే జరిగింది…కానీ కేంద్ర పెద్దలతో మాట్లాడుతామని పొడి పొడి మాటలు వాడుతున్నారు. కేంద్రం పొట్టలో గట్టిగా పొడుస్తూంటే ఇలా మెల్లమెల్లగా మాట్లాడమేంటని టీఆర్ఎస్ మరో వైపు ఫైర్ అవుతోందట. జగన్ ని సైతం కలుపుకుని వెళ్ళాలనుకుంటున్న కేసీఆర్ ఆలోచనలకు జగన్ ఇలా షాక్ ఇచ్చేస్తున్నారని అంటున్నారు.మరో వైపు చూసుకుంటే టీఆర్ఎస్ కేంద్రంలో అమీ తుమీకి రెడీ అవుతోంది. డైరెక్ట్ ఫైట్ అంటోంది. మోడీ వల్ల దేశం కుప్పకూలిందని ఘాటైన మాటలే కేసీఆర్ వాడేస్తున్నారు. తెలంగాణాకు ఒక్క పైసా కూడా ఇవ్వరా అంటూ హూంకరిస్తున్నారు. అదే సమయంలో జగన్ మాత్రం మౌన మంత్రం జపిస్తున్నారు. మోడీకి ఏపీని పక్కన పెట్టినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడడంలేదు. దాంతో కేసీఆర్ ఆలోచనలు కూడా మారుతున్నాయట. తాను ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేంద్రంపైన యుధ్ధం ప్రకటిస్తే మొదట కలసివచ్చేది జగనేనని ఆయన నిన్నటి వరకూ అనుకున్నారుట.అప్పట్లో సోనియాపైన, హస్తిన పెద్దల పైనా జగన్ పోరాట పటిమను చూసిన ఆయన ఢిల్లీని, మోడీని కూడా ఎదిరిస్తారని భావించారట. కానీ ఇపుడు జగన్ మాత్రం ఎక్కడా నోరు విప్పడంలేదు. దాంతో ఏపీ దారి వేరు, మన దారి వేరు, మోడీతో మనమే పోరుకు దిగుదామని కేసీఆర్ తన పార్టీ వారితో అంటున్నట్లుగా భోగట్టా. జగన్ కేంద్రానికి లొంగుతున్నారన్న భావన గులాబీ పార్టీలో ఉందంటు న్నారు. ఇదే బలపడితే మాత్రం రేపటి రోజున తెలంగాణా నుంచి కూడా ఏపీకి సహాయ నిరాకరణ, ఇబ్బందులు ఎదురవుతాయి. మరి జగన్ వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారో చూడాలి

Related Posts