YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విదేశీయం

ఆర్ధికంగా దెబ్బతింటున్న చైనా

ఆర్ధికంగా దెబ్బతింటున్న చైనా

ఆర్ధికంగా దెబ్బతింటున్న చైనా
బీజింగ్, ఫిబ్రవరి 4,
కరోనా వైరస్ దెబ్బకు చైనా విలవిలలాడుతోంది. వైరస్ కారణంగా చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో చైనాపై అన్నివైపుల నుంచి ఒత్తిడి నెలకొంది. అంతర్జాతీయ దేశాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. చైనా నుంచి వస్తున్న వారిపై ఆంక్షలు విధిస్తున్నాయి. అలాగే ఆయా దేశాలను చైనాకు డైరెక్ట్ ఫ్లైట్స్‌ను కూడా రద్దు చేస్తున్నాయి. కంపెనీలు కూడా మూతపడుతున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థపై మునుపెన్నడూలేని విధంగా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో ఆ దేశం స్టాక్ మార్కెట్ పేకమేడలా కూప్పకూలింది. ఒకే రోజు ఏకంగా 8 శాతం పతనమైంది.చైనా స్టాక్ మార్కెట్  8 శాతం పతనం కావడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.28 లక్షల కోట్లు పోయింది. షాంఘై కంపొసైట్ ఇండెక్స్ ఈ స్థాయిలో పడిపోవడం గత నాలుగేళ్లలో ఇదే తొలిసారి కవడం గమనార్హం.చైనా దేశ కరెన్సీ అయినా యువాన్ కూడా భారీగా నష్టపోయింది. ఒకే రోజులో 1.2 శాతం కుప్పకూలింది. దీంతో చైనాలో వచ్చే రోజుల్లో ఏం జరగబోతోందా? అని అందరిలోనూ టెన్షన్ నెలకొంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇప్పుడు చైనా యువాన్ 7.02 వద్ద ఉంది.అదుపు తప్పుతున్న పరిస్థితులను చక్కబెట్టేందుకు చైనా కేంద్ర బ్యాంక్ రంగంలోకి దిగింది. రివర్స్ రెపో రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 1.2 ట్రిలియన్ యువాన్ల (173.81 బిలియన్ డాలర్లు) భారీ మొత్తంలో నిధులను వ్యవస్థలోకి తీసుకువచ్చింది. చైనా బ్యాంక్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం 2004 నుంచి చూస్తే ఇదే ప్రథమం.చైనా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లలో కోత విధించినా కూడా స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల సునామీ ఆగలేదు. షాంఘై కాంపొసైట్ పతనానికి మాత్రం అడ్డుకట్ట పడలేదు.చైనాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 361కి చేరింది. మరో 17,205 మందికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధరించగా, ఆదివారం ఒక్కరోజే 2,829 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో 186 మంది పరిస్థితి విషమంగా ఉందని, ఇప్పటి వరకు 475 మంది వైరస్‌ నుంచి కోలుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.చైనా స్టాక్ మార్కెట్‌లో 2,500కు పైగా స్టాక్స్ పడిపోయాయి. అది కూడా ఏకంగా 10 శాతం కుప్పకూలాయి. చైనా షాంఘై కాంపొసైట్ 7.7 శాతం పతనంతో 2,746 పాయింట్ల వద్ద ముగిసింది. ఆగస్ట్ నెల నుంచి ఇదే కనిష్ట స్థాయి. ఇంట్రాడేలో మార్కెట్ 9 శాతం మేర క్షీణించింది.చైనా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎంతలా అంటే వైరస్ దెబ్బతో జనాలు కొన్ని చోట్ల ఇంట్లో నుంచి బయటకు రావడం కూడా మానేశారు. దీంతో ఆర్థిక వ్యవస్థపై నేరుగానే ప్రభావం పడింది. రెస్టారెంట్లు, రిటైలర్ షాపు వారికి అమ్మకాలు లేవు. అలాగే పలు చోట్ల కంపెనీలు కూడా ఉత్పత్తిని నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Related Posts