కేసీఆర్ కి కావాల్సిన ఫెడరల్ గవర్నమెంట్ ని టి.ఆర్.ఎస్ కోరుకుంటుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. శుక్రువారం సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో పంచాయితీ రాజ్ చట్ట సవరణ అనే అంశంపై అఖిలపక్షాల రౌండ్ టేబుల్ సమావేశం జరింగింది.హాజరు అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..పనిగట్టుకొని వ్యవస్థని నిర్విర్యం చేయాలనే దానికి టి.ఆర్.ఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.కేసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలుఅయింది.స్థానిక సంస్థలను టి.ఆర్.ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు.కేసీఆర్ సీఎం అయ్యాక గ్రామ పంచాయితిలకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదన్నారు. దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలనిధులు తన గుప్పిట్లో పెట్టుకొని పంచాయితిలకు రూపాయి కెటయించలేక పోతున్నారు. చివరికి సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులను ఇక్కడ ఇస్తున్నారు.అంతే తప్ప కేసీఆర్ సీఎం అయ్యాక రూపాయి నిధులు కేటాయించింది లేదన్నారు.స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలి.ఇప్పటికి ఓటరు లిస్ట్ ప్రక్రియ ను ఎలక్షన్ కమిషన్ ప్రారంభించలేదన్నారు. పరోక్ష పద్దతిలో ఎన్నికల ను నిర్వహించాడాన్ని వెనక్కి తీసుకొని ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించాలని డిమాండు చేశారు.28 న అన్ని గ్రామ పంచాయితీ లలో తీర్మానాలు పెట్టి ...ఇప్పుడున్న మాదిరిగానే పంచాయితీ ఎన్నికలు నిర్వచించాలని గవర్నర్ ని తీర్మానాలు పంపిస్తామన్నారు..సమావేశంలో చాడ వెంకట్ రెడ్డి, కోదండరాం, రాష్ట్ర సర్పంచ్ ల ఐక్య వేదిక అధ్యక్షులు ఆందోల్ కృష్ణ..
.