ఆంగ్ల నైపుణ్యాలను పెంచుకోవాలి"
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
కాగజ్‌నగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలనందు డిగ్రీ విద్యార్థులకు ఆంగ్ల నైపుణ్యాలపై గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జి.సుబ్బారావు విస్తరణోపన్యాసంఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఆంగ్ల పరిజ్ఞానం తప్పని సరి కాబట్టి విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డి.లక్ష్మీనరసింహంఅధ్యాపకులు టి.దత్తాత్రేయ, మధుకర్,రాజశేఖర్ పాల్గొన్నారు.