YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ భారతి హోళికేరి

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ భారతి హోళికేరి

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ భారతి హోళికేరి
రెవెన్యూ సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం ఆమె నెన్నల మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని సందర్శించారు. రైతుల సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదని రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు  ధరణి కంప్యూటర్ ఆపరేటర్ చిరంజీవి  సస్పెండ్ మెట్టుపల్లి విఆర్వో కుమేమో జారీచేసిన కలెక్టర్ . ఓవర్ లాపింగ్ ద్వారా గల్లంతు అయిన సర్వే నంబర్లను ఎన్ని నమోదు చేశారు, అని అడిగి తెలుసుకున్నారు. ఓవర్ లాపింగ్ సర్వే నంబర్లు ఇంత వరకు ఎందుకు పూర్తి చేయలేదు అని మండిపడ్డారు. రైతులు పనుల కోసం ఆఫీసుకు రాకుండా రెవెన్యూ సిబ్బంది రైతుల వద్దకే వెళ్లి వారి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక్కో విఆర్వోను పిలిచి వారి పరిధిలో గల భూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందిని అదుపు ఆజ్ఞతో ఉంచుకోవాలని తహసీల్దార్ శ్రీనివాస్ కు సూచించారు. ఈకార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రాజ్ కుమార్, ఎంపీడీవో వరలక్ష్మి,  ఏపిఎం విజయలక్ష్మి, గీర్దావర్ గణేష్, విఆర్వోలు దేవాజి, రాజ్ కుమార్, రాజయ్య, చందు, మధుకర్ రెడ్డి ఉన్నారు.

Related Posts