YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సమ్మక్క... సారాలమ్మ మహజాతరకు విచ్చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ సోమవారం పరిశీలించారు.మేడారంలో ప్రత్యేకంగా పోలీస్ క్యాంప్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను నోడల్ అధికారి వి.పి.గౌతమ్ , ఎ ఎస్పీ  శరత్ చంద్ర పాటిల్ సందర్శించి పరిశీలించారు.వి.ఐ.పి.అధికారులకు, వి.వి.ఐ.పి.అధికారులకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం పక్కనే ఉన్న ముఖ్యమంత్రి కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెస్ట్ రూమ్ ను పరిశీలిస్తూ హెలిపాడ్ చుట్టూ పక్కాగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే వి.ఐ.పి., వి.వి.ఐ.పి.ల కొరకు ఏర్పాటుచేసిన క్యూలైన్ ను పరిశీలించారు. దేవాలయ ప్రధాన గేట్ ను సందర్శించారు. ప్రధాన గేట్ నుండి అమ్మవార్ల గద్దె వద్దకు ముందస్తు అనుమతి లేనిదే ఎవరిని అనుమతించరాదని కలెక్టర్ దేవాలయ ఈ.ఓ.రాజేందర్ ను , పోలీస్ అధికారులను ఆదేశించారు.

Related Posts