YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

గజ్వేల్ లో మట్టి దందా

గజ్వేల్ లో మట్టి దందా

గజ్వేల్ లో మట్టి దందా
మెదక్, ఫిబ్రవరి 4,
మట్టి దందాకు మళ్లీ రెక్కలొచ్చాయి. స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతుండటంతో విచ్చలవిడిగా వెంచర్లు వెలుస్తున్నాయి. వెంచర్లలో రహదారుల నిర్మాణానికి స్థిరాస్తి వ్యాపారులకు మట్టి, మొరం అవసరం ఉండటంతో విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. వారి అవసరాన్ని సొమ్ము చేసు కునేందుకు దళారులు అధికారులను మచ్చిక చేసుకుని చెరువులు, కుంటల్లో మట్టి, మొరాన్ని తరలించి విక్రయిస్తూ రూ.లక్షలు గడిస్తు న్నారు. జల వనరుల్లో అనుమతులు లేకుండా ఎలాంటి తవ్వకాలు చేయకూడదని నిబంధన లున్నా.. వాటిని అమలు చేసే అధికారులు మిన్నకుండి పోవటం వెనుక కారణాలు చేతులు తడపడటమేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌ మున్సిపల్‌ పరిధిలో ప్రభుత్వం భారీ నిర్మాణాలు చేపట్టడంతో క్రమంగా వాణిజ్య పట్టణంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో స్థలాలకు విలువ పెరిగిపోవటంతో వేలాదిగా వెంచర్లు, వందల సంఖ్యలో ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటికి రోడ్లు, ఇండ్ల నిర్మాణానికి పునాదులకు మట్టి, మొరం అవసరాన్ని ఆసరా చేసుకుంటున్న దళారులు చెరువులు, కుంటల్లో తవ్వకాలు చేస్తున్నారు. ఒక్కో నిర్మాణానికి సరిపడా మట్టిని తరలించేందుకు రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షలు తీసుకుంటున్నట్టు నిర్మాణ దారులు చెబుతున్నారు. ఒక్కో వెంచర్‌లో రోడ్లకు మట్టి పోసేందుకు విస్తీర్ణాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు తీసుకుంటున్నారు. నెలకు సుమారు వంద ఇండ్ల నిర్మాణానికి మట్టి తరలిస్తున్నారు. అంటే ఎంత లేదనుకున్నా నెలకు రూ.1.50 కోట్ల మేర మట్టి దందా సాగుతున్నట్టు అంచనా. ఏడాది పొడవునా లెక్కేస్తే రూ.18 కోట్ల మేర మట్టి దందా సాగుతోంది. సంగాపూర్‌ కుంట, ప్రజ్ఞాపూర్‌ ఊర చెరువు, ముట్రాజ్‌పల్లి, సంగుపల్లి, సంగాపూర్‌, జాలిగామ శివారు, ఆరెపల్లి తదితర గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోంచి మట్టి తరలింపు జోరుగా సాగుతోంది. పగలు మట్టిని తవ్వి ఓ చోట డంపు చేసి రాత్రిపూట వెంచర్లకు తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. చెరువులు, కుంటల్లోంచి మట్టిని తవ్వి తీసి అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నట్టు కొందరు అధికారులు చెబుతున్నారు. ఆ పేరుతో వెంచర్లు, ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు లేకుండా చాలా చోట్ల మట్టిని తరలిస్తున్నారు. పలువురు రెవెన్యూ అధికారులు ఈ మట్టి దందాతో లక్షలకు పడగెత్తినట్టు బాహాటంగానే చెప్పుకుం టున్నారు. ఓ మట్టి వ్యాపారి గజ్వేల్‌లోని ఎర్రకుంటలో మట్టి తవ్వకాలతో పది టిప్పర్లు, రెండు పొక్లెయిన్లు కొనుగోలు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు.చెరువులు, కుంటల్లో ఎలాంటి మట్టి తవ్వకాలు చేపట్టకూడదని నిబంధనలున్నాయి. అయినా కొందరు ఇష్టం వచ్చినట్టు చెరువులు, కుంటల్లో మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. కొందరు అధికారుల మౌఖికంగా అండదం డలు అందిస్తుండటంతో అడ్డూ అదుపు లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.జేసీబీలు, పొక్లెయిన్లతో ఇష్టారీతిని మట్టిని తవ్వుతూ తరలించుకు పోతుడటంతో చెరు వులు, కుంటల్లో భారీ గోతులు తయారై ప్రాణాంతకంగా మారుతున్నాయి. గజ్వేల్‌లోని ఎర్రకుంట పూర్తిగా ధ్వంపమై బొగ్గుబావిని తలపిస్తోంది. ప్రజ్ఞాపూర్‌ ఊర చెరువులో గతేడాది నీట మునిగి గ్రామానికి చెందిన ఓ బాలుడు మృతి చెందాడు. అంతకు ముందు సంవత్సరం క్యాసారం కుంటలో నీళ్లు తాగేందుకు వెళ్లిన రూ. లక్షన్నర విలువైన కాడెడ్లు జేసీబీ గుంతలో మునిగి చనిపోయాయి. చెరువుల్లో మట్టి తవ్వకాలు చేపట్టవద్దని గ్రామస్తులు గజ్వేల్‌లో పెద్దఎత్తున ఆందోళన కూడా చేశారు. అయినా మట్టి తవ్వకాలు మాత్రం ఆగడం

Related Posts