హైదరాబాద్ ఎల్బీనగర్‌లో వైష్ణవి ఆస్పత్రిలో ఓ డాక్టర్ ఉరి వేసుకుని ఆత్మహత్య
ఎల్‌బీ నగర్‌లోని వైష్ణవి ఆస్పత్రికి చెందిన డాక్టర్ కర్నాల అజయ్ కుమార్... అదే ఆస్పత్రిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడ్డ డాక్టర్ అజయ్ కుమార్... తన చావుకు నలుగురు వ్యక్తులు కారణమంటూ సూసైడ్ నోట్ కూడా రాయడం సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తన ఆస్పత్రి బిల్డింగ్ యజమాని కరుణారెడ్డి, అతడి బావమరిది కొండల్ రెడ్డి, శివకుమార్, మెగారెడ్డి ఒత్తిడి కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఆయన తన సూసైడ్ నోట్‌లో వివరించారు. సూసైడ్ నోట్‌లో అతడు పేర్కొన్న వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. మృతుడు బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బందిని ఈ ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నారు. అయితే బిల్డింగ్ యజమాని వేధింపులు కారణంగానే డాక్టర్ అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రి భవనం బకాయిలకు సంబంధించి కొంతకాలంగా డాక్టర్ అజయ్, కరుణారెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ బకాయిల కోసం డాక్టర్ అజయ్‌పై వీరంతా ఒత్తిడి చేస్తున్నారని... పలుసార్లు ఆస్పత్రి సిబ్బందిని సైతం బెదిరించారనే వార్తలు వినిపిస్తున్నాయి. అజయ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు... సూసైడ్ నోట్‌లో అతడు పేర్కొన్న వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. మృతుడు బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బందిని ఈ ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నారు. అయితే బిల్డింగ్ యజమాని వేధింపులు కారణంగానే డాక్టర్ అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.