YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

పడకేసిన పర్యాటకం

పడకేసిన పర్యాటకం

పడకేసిన పర్యాటకం (కృష్ణా జిల్లా)
కైకలూరు, ఫిబ్రవరి 04  అరుదైన మత్స్య సంపదకు పేరొందిన కొల్లేరు సరస్సు ఆహ్లాద వాతావరణంతో అలరారుతుంటుంది. ఆసియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సులో పర్యాటకాభివృద్ధికి అంతులేని వనరులు ఉన్నాయి. ఎటు చూసినా గలగల పారుతున్న నీటి ప్రవాహాలు.. పచ్చని తివాచీ పరిచినట్లుండే గడ్డిమొక్కలు.. మధ్యలో సంప్రదాయబద్ధంగా తాటిదోనెలపై సాగే మత్స్యకారుల వేట.. కళ్లను తిప్పుకోనివ్వవు. ఖండాలు దాటి వచ్చే ఎన్నో జాతుల పక్షులు.. అవి చేసే చిత్రవిచిత్ర విన్యాసాలతో చూపరులను అబ్బుర పరుస్తుంటాయి. వేలాది పక్షులను ఒకేచోట చూడాలనుకునే వారు తప్పక కొల్లేరును ఒకసారి దర్శించి తీరాల్సిందే. గత పదేళ్లుగా కొల్లేరు పర్యాటకాభివృద్ధిపై ప్రభుత్వాలు హామీలు ఇవ్వడమే తప్ప ఆచరణలో మాత్రం విఫలమవుతున్నాయి. ఏటా అక్టోబరు నుంచి తూర్పు ఐరోపా, ఉత్తరాసియా ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో అందాల అతిథులు కొల్లేరులో సంతానోత్పత్తికి వస్తుంటాయి. ఆటపాక పక్షుల కేంద్రం పక్షుల వీక్షకులకు స్వర్గధామంగా ఉంటుంది. 270 ఎకరాల విస్తీర్ణంలోని చెరువులో ్జమాత్రమే పక్షులు మనుగడకు అవసరమైన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పెద్దఎత్తున పక్షులు కేంద్రంలోనే స్థిరనివాసాలను ఏర్పాటు చేసుకుని సంతానోత్పత్తిని చేసుకుంటుంటాయి. అనంతరం మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పిల్లలతో కలిసి స్వదేశాలకు వెళుతుంటాయి. ఈ సమయంలో పర్యాటకులకు కనువిందేనంటే అతిశయోక్తి కాదు. కొల్లేరు పర్యాటకాభివృద్ధికి అంతులేని అవకాశాలు, వనరులున్నాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని ఆదాయ వనరుగా చక్కగా మార్చుకున్నా.. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొల్లేరు పర్యాటకానికి అయిదేళ్లుగా ఒక్క రూపాయిని కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్ఛు సరస్సును వన్యప్రాణి అభయారణ్యం కింద కేంద్రప్రభుత్వం గురించినందున ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టడానికి అవరోధాలు ఏర్పడుతున్నాయి. పర్యాటకాదాయ పరంగా సరస్సు రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలుస్తుందన్న విషయాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాల్సిన అవసరముంది. 2017లో ఆటపాక పక్షుల కేంద్రం వద్ద పెలికాన్‌ పెస్టివల్‌ను నిర్వహించి పెద్దఎత్తున పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. రెండేళ్లుగా ఈ పక్షుల పండగ మాటే లేకుండా పోయింది. ఏటా నెల్లూరు జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నట్లే ప్రభుత్వం ఇక్కడ కూడా పెలికాన్‌ ఫెస్టివల్‌ను జరిపితే పర్యాటకంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశముంది. కొల్లేరుపై రెగ్యులేటర్‌ను నిర్మించి ఐదడుగుల నీటిని స్థిరీకరించాలని ఎప్పటి నుంచో స్థానిక నేతలు వాదిస్తున్నా సాధ్యం కావడం లేదు. కొల్లేరులో రోడ్లు అభివృద్ధి చేసి, పర్యాటకులు బస చేసేందుకు వీలుగా రిసార్టులు, రెస్టారెంట్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. కొల్లేరు పరిధిలోని మండవల్లి మండలం మణుగులూరులో 200 ఎకరాల్లో చెరువును తవ్వి పక్షుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మరింత శోభాయమానంగా ఉంటుంది. పెదఎడ్లగాడి నుంచి ఉప్పుటేరు వరకు కొల్లేను ఛానలైజేషన్‌ చేపట్టి అక్కడక్కడ పక్షుల ఆవాసాలు ఏర్పాటు చేసుకునే వీలుగా స్టాండ్లు, మట్టిదిబ్బలు ఏర్పాటు చేయాలి. పెద్దఎడ్లగాడి నుంచి ఆటపాక పక్షుల కేంద్రాన్ని కలుపుతూ ఉప్పుటేరు వరకు 22 కిలోమీటర్ల బోటుషికారు ఏర్పాటు చేస్తే రమణీయంగా ఉంటుంది

Related Posts