YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాష్ట్ర పర్యాటక రంగంలో మరో కలికితురాయికి కార్యాచరణ ప్రణాళికలు

రాష్ట్ర పర్యాటక రంగంలో మరో కలికితురాయికి కార్యాచరణ ప్రణాళికలు

రాష్ట్ర పర్యాటక రంగంలో మరో కలికితురాయికి కార్యాచరణ ప్రణాళికలు
విజయవాడ ఫిబ్రవరి 04 br /> ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం , సివిల్ ఏవియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణానది ప్రాంతంలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద వాటర్ డ్రోమ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడంపై అధ్యయనం చేస్తున్నామని జిల్లా కలెక్టరు | ఏ . యండీ . ఇంతియాజ్ తెలిపారు మంగళవారం స్థానిక బారంపార్క్ లోని పున్నమి ఘాట్ , తదితర ప్రాంతాలలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కలికాల వలవెన్ , సాంకేతిక బృందం , రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు . ఈ సందర్భంగా కలెక్టరు ఏ . యండి . ఇంతియాజ్ మాట్లాడుతూ కృష్ణానది పరివాహక ప్రాంతమైన ప్రకాశం బ్యారేజ్ ప్రాంతంలో వాటర్  డ్రోమ్ ఫెసిలిటీ ( నీటిపై ల్యాండ్ మరియు టేకాఫ్ అయ్యే విమానయానం ) ఏర్పాటుపై సాంకేతిక బృందంతో పరిశీలన చేసామన్నారు . ఇక్కడి ప్రాంతంలో మాలికవసతులు , సౌలభ్యం , తదితర అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యాయనం చేయడం జరుగుతుందన్నారు . నీటిపై దిగి , పైకి లేచే విమానాలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటక పరంగా ఎంతో సానుకూలతగల ప్రాంతంగా మెరుగైన అవకాశాలు కలిగి ఉన్నాయన్నారు . ఇక్కడి నుండి పాపికొండలు , నాగార్జున కొండ ప్రాంతాలలో ల్యాండ్ అయ్యే విధంగానూ మరియు హైదరాబాదు కూడా సర్వీసు ను నడిపే అవకాశాలు ఉన్నాయన్నారు . సాంకేతిక నిపుణులు సూచనలు , సలహాలు మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు . సాంకేతిక బృందం సిఫార్సు లు , అధ్యయనాల పై ప్రభుక్వానికి నివేదిక సమర్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు . వాటర్ డ్రోమ్ ఫెసిలిటి ద్వారా విజయవాడ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు .  ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పోరేషన్ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వాహణా అధికారిణి నీనాశర్మ మాట్లాడుతూ సివిల్ ఏవియేషన్ ద్వారా రూ . 50 కోట్లుతోనూ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు , తదితర పనులు కోసం రూ . 10 కోట్లు భాగస్వామ్యంతో వాటర్ డ్రోమ్ ఫెసిలిటిని అందుబాటులోనికి తీసుకురావడానికి గల అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందన్నారు . బెరంపార్క్ , భవాని ఐల్యాండ్ వంటి పర్యాటక ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు , హైదరాబాద్ , బెంగుళూరు , చెన్నై వంటి ప్రాంతాలకు పర్యాటకులు పర్యటించేందుకు చక్కని అవకాశాలు ఈ ప్రాంతం కలిగి ఉందని ఆమె తెలిపారు . ఈ పర్యటనలో జాయింట్ కలెక్టరు కె . మాధవిలత , సబ్ కలెక్టరు హెచ్ . యం . ధ్యాన చంద్ర , విజయవాడ పశ్చిమ తహశీల్దారు యం . మాధురి , డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు సిహెచ్ . గోపీనాద్ . ప్రకాశం బ్యారేజ్ ఏఇఇ వి . దినేష్ రాఘవేంద్ర కుమార్ , ఏవియేషన్ డిజియం బి . గోపీకృష్ణన్ , అసిస్టెంట మేనేజరు యస్ . యాదవ్ , తదితరులు పాల్గొన్నారు 

Related Posts