ఎల్ఐసీ ఉద్యోగుల ధర్నా
సిద్దిపేట జనవరి 04
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్ఐసి కార్యాలయం ముందు ఎల్ఐసి ఉద్యోగులు, ఏజెంట్ లతో కలిసి ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎల్ఐసి ని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని, స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాలసీదారుల పై జీఎస్టీ ని రద్దు చేయాలన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఎల్ఐసి ని ప్రైవేటీకరణ చేసే అంశాన్ని మంత్రి ప్రస్తావించారన్నారు. ఎల్ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే కుట్రలు జరుగుతున్నాయని ఇది సరైంది కాదన్నారు. ఈ ప్రయత్నాలను మానుకొవాలని, లేనియెడల కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.