YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కోమటిరెడ్డి వెంకటరెడ్డి గన్మెన్ల తొలగింపు కక్ష సాధింపు చర్యలే - భట్టి విక్రమార్క!!

కోమటిరెడ్డి వెంకటరెడ్డి గన్మెన్ల తొలగింపు కక్ష సాధింపు చర్యలే - భట్టి విక్రమార్క!!

కోర్టు కు అసెంబ్లీ పూటేజ్లు ఇవ్వడానికి భయమెందుకు..
కొప్పుల రాజుకు అభినందనలు.. భట్టి.

తనకు ప్రాణహాని ఉందని ఒకవైపు ఎమ్యెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో ప్రభుత్వం ఒక సీనియర్ ప్రజా ప్రతినిధికి భద్రతను తొలగించడం, గన్ మెన్లను తీసివేయడం చాలా దారుణమని, ఇది కక్ష సాధింపు చర్యలేనని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు భట్టి విక్రమార్క అన్నారు. 

ఆయన మంగళవారం ఒక ప్రకటన చేస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆయనకు ఎలాంటి హాని జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

హై కోర్ట్ అసెంబ్లీ వీడియోలు అడిగితే 15 రోజులకు కూడా ఇవ్వడం లేదని ఫుటేజీలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు భయమని ఆయన ప్రశ్నించారు. 

ఏఐసీసీ ఏసీ డిపార్ట్మెంట్ ఛైర్మెన్ గా కొప్పుల రాజు చాలా క్రియాశీలకంగా పనిచేశారని, ఆయన హయాంలో దేశవ్యాప్తంగా ఎస్సి డిపార్ట్మెంట్ ఎంతో విస్త్రతంగా పని చేసిందని, కొత్తగా రాహుల్ గాంధీ కార్యాలయంలో ఆయన సేవలు మరింత గొప్పగా ఉంటాయని ఆయన అన్నారు..

Related Posts