YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆసుపత్రులపై సీఎం సమీక్ష

ఆసుపత్రులపై సీఎం సమీక్ష

ఆసుపత్రులపై సీఎం సమీక్ష
అమరావతి ఫిబ్రవరి 04 
రాష్ట్రంలోని  ఆస్పత్రుల్లో నాడు–నేడు, సబ్సెంటర్ల నిర్మాణం, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యకార్డుల జారీపై సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష జరిపారు. ఈ భేటీకి వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్, అధికారులు హాజరు అయ్యారు. జిల్లా ఆస్పత్రులను బోధనాసుపత్రులుగా మార్చడంపై దృష్టిపెట్టాలి. దీనివల్ల సిబ్బంది కొరత తీరే అవకాశాలుంటాయని, సరిపడా సీట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న విధానం చాలా పాతది అని, కొత్త విధానాలపై ఆలోచనలు చేయాలని సీఎం సూచించారు. 9 చోట్ల బోధనాసుపత్రులు పెట్టేందుకు అవకాశాలున్నాయని చూచాయగా అధికారులు తెలిపారు. 4–5 ఆస్పత్రుల్లో వెంటనే ఈ ప్రతిపాదనను అమలు చేయవచ్చని సీఎంకు వెల్లడించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి  ఒక బోధనాసుపత్రి ఉండేలా చూడాలి. ఈ బోధనాసుపత్రులను స్వయంశక్తితో నడిచేలా ఆలోచన చేయాలి. ప్రజారోగ్య రంగంపై ఇదివరకటి ప్రభుత్వాలు ఆలోచన చేయలేదు. అందువల్లే ఇవాళ పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయని అన్నారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్య వ్యవస్థను అందించడానికి కృతనిశ్చయంతో ఉన్నాం. ప్రతిపార్లమెంటు నియోజకవర్గానికొక బోధానుసుపత్రి ఏర్పాటుచేసి, భవిష్యత్తులోనూ అవి మెరుగ్గా నడిచేలా ఒక ప్రణాళిక తయారుచేయాలని సీఎం సూచించారు. ఆరోగ్య ఉపకేంద్రాల (సబ్సెంటర్లు) నిర్మాణంపై సీఎం సమీక్ష నాడు– నేడు లో చేపట్టే పనులు నాణ్యంగా ఉండాలని సీఎం అన్నారు. నాడు – నాడులో భాగం ఈ కింద వాటిలో పనులు 1,138 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆస్పత్రులు, 169 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో నాడు – నేడు కింద అభివృద్ధి పనులు, కొన్నిచోట్ల కొత్త నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 11 కాలేజీలకు అదనంగా ప్రతిపాదిస్తున్న కాలేజీలతో కలిపి కనీసం 27 నుంచి 28 కాలేజీలు అవుతాయని సీఎం అన్నారు. దీంతో భవిష్యత్తులో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా ఉంటుందని న్నారు.  రాష్ట్రంలోని సూపర్ స్పెషాల్టీ మెడికల్ కోర్సులపైనా దృష్టిపెట్టాలన్న సీఎం *రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఈ సూపర్ స్పెషాల్టీ కోర్సుల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని అయన అన్నారు. ఇంత పెద్దస్థాయిలో ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు ఏర్పాట చేస్తున్నందున ఒకే యూనివర్శిటీ పర్యవేక్షించడం కష్టమవుతుందని, దీనికోసం రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకూ మూడు మెడికల్ యూనివర్శిటీలను ఏర్పాటుపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. వాటి పరిధిలోని మెడికల్కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ అంశాలపై సమగ్రమైన విధానం ఉండాలని అన్నారు. 
ఈ ఏడాది మేనెల నాటికి వైద్య–ఆరోగ్యశాఖలో కావాల్సిన సిబ్బందిని రిక్రూట్చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆతర్వాత ప్రజలకు వైద్య సేవల్లో ఎలాంటి లోపం ఉండకూడదని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏప్రిల్ నుంచి డబ్ల్యూహెచ్ఓ, జీఎంపి (గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్) ప్రమాణాలతో కూడిన మందులు పంపిణీకి ఆదేశించారు.  ఫిబ్రవరి 17 నుంచి మూడో విడత కంటి వెలుగు  దాదాపు 10 లక్షల మందికి శస్త్రచికిత్సలు అవసరమవుతాయని అంచనా వేశామని అధికారులు అన్నారు. ఆపరేషన్లు ఎక్కువగా చేయాల్సి ఉన్నందున ఇంకా ఎక్కువ సమయంపట్టే అవకాశం ఉంది. స్క్రీనింగ్, లోపాల గుర్తింపు, కంటి అద్దాల పంపిణీ, ఆపరేషన్లు అన్నీ సమకాలంలో జరుగుతాయని అధికారులు సీఎం కు తెలిపారు.  ఆస్పత్రుల్లో నాడు – నేడు కార్యక్రమాన్ని కర్నూలులో ముఖ్యమంత్రి  ప్రారంభించనున్నారు. అదేరోజు సబ్సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన, మూడోవిడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభింస్తారు. డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్, టీబీ, లెప్రసీల గుర్తింపునకు త్వరలో విస్తృతంగా పరీక్షలు జరపాలి. ఏప్రిల్ 1నుంచి ప్రారంభం, గుర్తించిన వారికి వైద్యం అందిస్తారు. 

Related Posts