YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

ట్రంప్ శాంతి ప్రణాళికను తిరస్కరించిన ఓఐసి 

ట్రంప్ శాంతి ప్రణాళికను తిరస్కరించిన ఓఐసి 

ట్రంప్ శాంతి ప్రణాళికను తిరస్కరించిన ఓఐసి 
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 4
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన మధ్యప్రాచ్యదేశాల శాంతి ప్రణాళికను ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసి) తిరస్కరించింది.ఇటీవల ట్రంప్ ఆవిష్కరించిన ఈ ప్రణాళికపై చర్చించాలని పాలస్తీనా నాయకత్వం చేసిన అభ్యర్థనపై 57 మంది సభ్యులతో సంఘం సమావేశం నిర్వహించింది.అరబ్ లీగ్ తిరస్కరించిన కొద్ది రోజుల తరువాత ట్రంప్ యొక్క “శతాబ్దపు ఒప్పందాన్ని “ఓఐసి తిరస్కరించడం గమనార్హం.ఇది పాలస్తీనా ప్రజల కనీస హక్కులు మరియు ఆకాంక్షలను తీర్చదు” అని వారు పేర్కొన్నారు.మూడు సంవత్సరాలు గా రూపొందిస్తున్నమిడిల్ ఈస్ట్ ప్రణాళిక లో జెరూసలేంను ఇజ్రాయెల్ యొక్క “అవిభక్త” రాజధాని ఏర్పాటు చేసి రెండు ప్రాంతాలను కలిపేందుకు తోవ చూపితే చరిత్రలో సుదీర్ఘ సమస్యకు పరిస్కారం కనిపెట్టినట్లవుతుందని వారు పేర్కొన్నారు.విదేశాంగ మంత్రుల స్థాయిలో “ఓపెన్-ఎండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం” లో చర్చించి “అమెరికా అధికార బృందం తన శాంతి ప్రణాళికను ప్రకటించిన తరువాత దీనిపై ఓఐసి ఒక నిర్ణయం తీసుకుంటుందని ట్విట్టర్లో తెలిపింది.విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుస్సేన్ జాబెరి నేతృత్వంలోని ఇరాన్ ప్రతినిధి బృందానికి వీసాలు నిరాకరించడం ద్వారా సమావేశానికి హాజరుకాకుండా ఇరాన్ ను నిషేధించారు.

Related Posts