YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విభజన ద్వారా అభివృద్ది

విభజన ద్వారా అభివృద్ది

విభజన ద్వారా అభివృద్ది
కడప ఫిబ్రవరి 4
అనేక సంవత్సరాలుగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలో రాజధానులు ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానుల విషయంలో ప్రముఖ సీనియర్ అధికారులు, న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెప్పించుకున్నారని గుర్తు చేశారు. నివేదికలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో శివరామకృష్ణ కమిటీ నివేదిక ఏమైందని ఆయన ప్రశ్నించారు. అప్పట్లోనే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని కమిటీల నివేదిక స్పష్టం చేశాయని అన్నారు. కానీ, గత టీడీపీ ప్రభుత్వంలో కమిటీల నివేదికను బుట్ట దాఖలు చేశారని ఆయన మండిపడ్డారు.రాష్ట్రంలో అన్ని జిల్లాల అభివృద్ధి టీడీపీకి ఇష్టం లేదని అంజాద్‌ బాషా మండిపడ్డారు. ముందుగా టీడీపీ నేతలు వారి వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గల్లీ నాయకుడి కన్నా హీనంగా తయారయ్యారని ఆయన దుయ్యబట్టారు. అమరావతి విషయంలో చంద్రబాబు తీరు దుర్మార్గమని అన్నారు. కమిటీల నివేదికను గౌరవిస్తూ సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. అమరావతిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని ఫైర్‌ అయ్యారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు సంతోషంగా మద్దతిస్తున్నారని తెలిపారు. పెద్దల సభ అంటే ప్రభుత్వ నిర్ణయాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు. కానీ, మండలిలో బలం ఉందని.. ప్రభుత్వ బిల్లును అడ్డుకోవడం దారుణమన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ నేతలు మండలిని వాడుకున్నారని ఆయన విమర్శించారు. ప్రజలకు అవసరం అయ్యే బిల్లులను అడ్డుకోవడమే పరమావధిగా టీడీపీ నేతలు తయారయ్యారని అంజాద్‌ బాషా  మండిపడ్డారు.

Related Posts