YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 మహారాష్ట్రలో రాజ్యసభ సభ్యులు కోసం పైరవీలు

 మహారాష్ట్రలో రాజ్యసభ సభ్యులు కోసం పైరవీలు

 మహారాష్ట్రలో రాజ్యసభ సభ్యులు కోసం పైరవీలు
ముంబై, ఫిబ్రవరి 5,br /> సంకీర్ణ ప్రభుత్వం అంటేనే తలనొప్పి. నిర్ణయంలోనైనా, పదవుల పంపకాల్లోనైనా తేడాలొస్తే సంకీర్ణం కుప్పకూలిపోవడం ఖాయం. ఇప్పుడు మహారాష్ట్రాలో మరో ఎన్నికకు సంకీర్ణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. మహారాష్ట్ర లో రాజ్యసభ ఎన్నికలకు ఇప్పటి నుంచే అన్ని పార్టీలూ కసరత్తులు ప్రారంభించాయి. మొత్తం మహారాష్ట్రలో ఏడు రాజ్యసభ పదవులు ఖాళీ కాబోతున్నాయి. ఏప్రిల్ నెలలో ఈ ఎన్నిక జరనుండటంతో ఇప్పటి నుంచే వ్యూహాలకు అన్ని పార్టీలూ పదును పెట్టాయి.పార్టీల సంఖ్యాబలాన్ని బట్టి రాజ్యసభ సభ్యులు ఎన్నికవుతారు. మహారాష్ట్రలో మొత్తం 288 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే రాజ్యసభ పదవి దక్కుతుంది. ప్రసుత్తం పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా 105 స్థానాలు ఉన్నాయి. బీజేపీకి సులువుగా మూడు రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశముంది. అలాగే శివసేనకు 56 మంది, కాంగ్రెస్ కు 44 మంది, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే కూటమిగా ఏర్పడటంతో వీటికి మూడు రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశాలున్నాయి.మూడు రాజ్యసభ పదవుల్లో తలా ఒకటి పంచుకుంటారన్నది ఇప్పటి వరకూ తెలుస్తోంది. శరద్ పవార్ తో పాటు కాంగ్రెస్, శివసేన లనుంచి కూడా పదవీ విరమణ చేయనున్నారు. ఎన్సీపీ నుంచి శరద్ పవార్ రాజ్యసభ పదవి గ్యారంటీ. ఇందులో ఎటువంటి సందేహం లేదు. శివసేన నుంచి రాజ్ కుమార్ దూత్ ఉన్నారు. మరి ఈయనకు మరోసార రెన్యువల్ చేస్తారా? లేదా? మరొకరికి పదవి ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ నుంచి హుస్సేన్ దల్వాయి పదవీ విరమణ చేస్తున్నారు. ఈయన స్థానంలో మరొకరిని ఎంపిక చేసే అవకాశముంది. ఏడో రాజ్యసభ పదవి కోసం గట్టి పోటీ ఏర్పడే అవకాశముంది. బీజేపీ కూడా ఇందుకోసం ప్రయత్నిస్తుంది. శివసేన ఏడో రాజ్యసభ పదవి కోసం పోటీ చేయవచ్చన్న అంచనాలో ఉంది. తమ బలంతో పాటు సమాజ్ వాదీ పార్టీ నుంచి ఒకరు, బహుజన్ వికాస్ అఘాడీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్లు ముగ్గురు ఉండటంతో వారి అండతో ఏడో స్థానాన్ని చేజిక్కించుకోవచ్చన్న అంచనాలో శివసేన ఉంది. బీజేపీ పోటీకి దింపితే ఏడో స్థానాన్ని కాంగ్రెస్, ఎన్సీపీలు శివసేనకే వదిలేసే అవకాశముందంటున్నారు. మొత్తం మీద పదవుల పంపకంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మూడు పార్టీలు నిర్ణయించాయి.

Related Posts