YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 69 కిలోమీటర్లకు చేరనున్న మెట్రో రైల్

 69 కిలోమీటర్లకు చేరనున్న మెట్రో రైల్

 69 కిలోమీటర్లకు చేరనున్న మెట్రో రైల్
హైద్రాబాద్, ఫిబ్రవరి 5,
భాగ్యనగరానికి మణిహారం హైదరాబాద్ మెట్రో రైలులో మరో ముందడుగు పడనుంది. కీలకమైన ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ మెట్రో మార్గం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. శుక్రవారం  సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ఈ మార్గాన్ని ప్రారంభించనున్నారు. దీంతో మెట్రో మొదటి దశలో పాతబస్తీ పరిధిలో 6 కి.మీ. మినహా అన్ని మార్గాల్లో సేవలు అందుబాటులోకి రానుండటం విశేషం. కారిడార్ 1, 2, 3 కలిపి మొత్తం 69 కి.మీ. మేర మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా కీలకమైన సికింద్రాబాద్, హైద్రాబాద్ మధ్య మెట్రో కనెక్టివిటీ అందుబాటులోకి రానుండటం విశేషం.మెట్రో మొదటి దశ కారిడార్‌-2లో ఉన్న జేబీఎస్ - ఎంబీఎస్ మార్గం మొత్తం 11 కి.మీ. మేర ఉంది. ఈ మార్గంలో 9 మెట్రో స్టేషన్లు వచ్చాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో కలిపే ప్రధాన మెట్రో స్టేషన్ ఈ మార్గంలో వస్తోంది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ మార్గంలో ట్రయల్‌ రన్‌ కూడా విజయవంతంగా కొనసాగుతోంది. మెట్రో రైలు భద్రతా విభాగం నుంచి 20 రోజుల కిందటే అనుమతులు కూడా వచ్చాయి.హైదరాబాద్ మెట్రోలో కారిడార్-2కు అత్యంత ప్రాముఖ్యం ఉంది. ఈ మార్గంలో మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తే.. నగరంలోని ప్రధాన ప్రాంతాలన్నింటికీ మెట్రో సేవలు అందినట్లవుతాయి. ప్రస్తుతం కారిడార్‌-1, కారిడార్‌-3 కలిపి మొత్తం 56 కి.మీ మేర మెట్రో రైలు పరుగులు పెడుతోంది. జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గం అందుబాటులోకి వస్తే.. ఈ పరిధి మరో 11 కి.మీ. పెరుగుతుంది.రెండు అతిపెద్ద బస్టాండులను లింక్ చేస్తూ నిర్మించిన జేబీఎస్ -ఎంజీబీఎస్‌ మెట్రో కారిడార్‌ అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్ వాసుకే కాకుండా.. జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భాగ్యనగరానికి వచ్చే వారికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.ఇప్పటికే ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌ నుంచి కారిడార్‌-1కు సంబంధించిన మెట్రో రైళ్ల నిర్వహణ కొనసాగుతోంది. దాని పైనుంచి కారిడార్‌-2కు సంబంధించిన మెట్రో రైలు వెళ్లేలా నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో మెట్రో రైళ్లు మరింత శోభ సంతరించుకోనున్నాయి. ప్రధాన ప్రాంతాల్లో మెట్రో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుండటంతో.. ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డులను నెలకొల్పే అవకాశం ఉంది. మొదటి దశలో ప్రతిపాదించిన మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుండటంతో హైదరాబాద్ మెట్రో సరికొత్త రూపం సంతరించుకుంటుంది. నగరంలోని 6 దిక్కుల నుంచి మెట్రో కారిడార్‌లను నిర్మించడంతో పాటు అవి కోర్‌ సిటీలో ఒకదానితో ఒకటి కలిసేలా నిర్మించడంతో మెట్రో త్రికోణాకారంలో కనిపిస్తుంది.

Related Posts