YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

 ఢిల్లీ ఎన్నికల్లో జగన్ ఫార్ములా

 ఢిల్లీ ఎన్నికల్లో జగన్ ఫార్ములా

 ఢిల్లీ ఎన్నికల్లో జగన్ ఫార్ములా
ఇంటింటికి రేషన్
న్యూఢి్ల్లీ, ఫిబ్రవరి 5,
ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఫాలో అయిందా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌పై ప్రభావం చూపాయా? అంటే కచ్చితంగా ఏపీ పథకాలను ఆదర్శంగా తీసుకున్నారనే అనిపిస్తోంది. హోరాహోరీగా జరుగుతున్న ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ మేనిఫెస్టోలను ప్రకటించగా.ఆప్ తమ ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది.ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన ఆప్.. ఢిల్లీవాసులపై హామీల వర్షం కురిపించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఇతర మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు కలిసి ‘28 పాయింట్ల గ్యారెంటీ కార్డ్’ విడుదల చేశారు. ఈ హామీలను ఎట్టిపరిస్థితుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కొనసాగిస్తున్న పథకాలను కొనసాగిస్తామన్నారు.నాణ్యమైన విద్య, ప్రభుత్వ పాఠశాలల్లో దేశభక్తి పాఠ్యాంశాలు, స్వచ్ఛమైన తాగునీరు, నిరంతర విద్యుత్‌ సరఫరాకు ఎన్నికల మేనిఫెస్టోలో ఆప్ హామీ ఇచ్చింది. అలాగే ఏపీలో అమలు చేస్తున్న ఇంటింటికీ రేషన్ ఇచ్చే పథకాన్ని ఆప్ తమ మేనిఫెస్టోలో చేర్చింది. ఏపీలో వలంటీర్లు ఇంటికొచ్చి రేషన్ సరుకులు ఇచ్చే మాదిరిగానే డోర్ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే 10 లక్షల మంది వృద్ధులను ఉచితంగా తీర్థయాత్రలకు పంపుతామని తెలిపింది.పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో ఉండగా మరణిస్తే వారి కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇస్తామని ఆప్ హామీ ఇచ్చింది. నాణ్యమైన విద్యలో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించడంతో పాటు, ఢిల్లీ పాఠశాలల్లో దేశభక్తి పాఠ్యాంశాలను ప్రవేశపెడతామని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. 24 గంటలు మార్కెట్లు అందుబాటులో ఉండేలా పైలట్ ప్రాజెక్టును చేపడతామని కూడా తెలిపింది. ఇందులో ఏపీలో మాదిరిగానే ఇంగ్లిష్ ప్రాధాన్యతను గుర్తించి విద్యార్థులకు కచ్చితంగా ఆంగ్లం నేర్పిస్తామని పేర్కొంది.ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తామని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసిడియా చెప్పారు. యువకులు, మహిళలు, సామాన్య ప్రజానీకం సాధికరతకు పెద్ద పీట వేస్తామన్నారు. ప్రధాని మోడీ సోమవారం బహిరంగ సభలో మాట్లాడుతూ లోక్‌పాల్ గురించి మాట్లాడిన పెద్ద మనుషులు ఏమయ్యారని అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్‌గా ఢిల్లీ జన్‌లోక్‌పాల్ బిల్లు పాస్ అయ్యేందుకు చర్యలు తీసుకుంటామని సిసోడియా చెప్పారు.ఢిల్లీ పీఠాన్ని మళ్లీ కేజీవ్రాలే అధిరోహించనున్నారా? అంటే సర్వేలన్నీ అవుననే సమాధానం చెబుతున్నాయి. ఇప్పటికే అనేక సర్వేలు ఢిల్లీ తర్వాతి సీఎం కేజ్రీవాలేనని తేల్చిచెప్పగా.. తాజాగా, టైమ్స్ నౌ సర్వేలోనూ అదే విషయం వెల్లడైంది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 54- 60 స్థానాల్లో గెలుస్తుందని, బీజేపీ 10-14 సీట్లను సొంతం చేసుకుంటుందని టైమ్స్ నౌ అంచనా వేసింది. కాంగ్రెస్‌ పార్టీ రెండు స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది.

Related Posts