YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

భీష్మ ఏకాదశి 

భీష్మ ఏకాదశి 

 భీష్మ ఏకాదశి 
రేపు అనగా 05-ఫిబ్రవరి-20 (బుధవారం) భీష్మ ఏకాదశి లేదా భైమి ఏకాదశి.

మాఘ మాసములో వచ్చే విశిష్టమైన తిథి మాఘ శుక్ల ఏకాదశి. విష్ణు సహస్రనామం ఆవిర్భవించిన పుణ్యతిధి. పరమపావనమైన ఈ రోజున ఇంటిలో లక్ష్మినారాయణులను భక్తితో పూజించి, పాలను నైవేద్యంగా ఉంచి, విష్ణు సహస్రనామములను, విష్ణు అష్టోత్తరములను పారాయన చేసి, పాలు, పండ్ల వంటి సాత్వికాహారం తీసుకొని ఉపవాసం ఉండాలి. దగ్గర్లోని వైష్ణ్వవాలయాన్ని సందర్శించి మరియు ఈ రోజున నిత్య పూజ, ఉపవాసాది కార్యక్రమములను చేయడం ద్వారా విశేషమైన సిరిసంపదలు కలుగుతాయి, సమస్త పాపముల నుండి విడివడి వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. మహాభారత యుద్ధ సమయంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడిని స్తుతిస్తూ శరీరం విడిచిపెట్టి మోక్షం పొందింది ఈ ఏకాదశి నాడే కావున దీనిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు.
చేయవలసినవి:
- దగ్గరలోనున్న వైష్ణవ ఆలయాన్ని సందర్శిస్తే విశేషంగా విష్ణు భగవానుడి అనుగ్రహం పొందుతారు.
- విష్ణుసహస్రనామాన్ని పారాయణ చేయండి.
- రోజంతా కృష్ణ, మాధవ, గోవింద అని హరినామాన్ని జపించండి.
- *మద్యపానం, మాంసాహారం* వంటి పాపకర్మలకు దూరంగా ఉండండి.
ఏకాదశి రోజున ధాన్యంతో(బియ్యం, గోధుమ, బార్లే వంటివి) చేసిన ఆహారం నిషిద్ధము కావున  పాలు, పండ్లు వంటి సాత్వికమైన ఆహారం స్వీకరించవచ్చు.
-శక్తి కొలది దాన, ధర్మాదులు, జప, తపాదులు చేయడం మంచి ఫలితాన్నిస్తుంది. 
హరినామ స్మరణం-సమస్తపాపహరణం
  *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు *

Related Posts