మాఘమాసం,శుక్ల పక్షం ఏకాదశి రోజున భీష్మ ఏకాదశిని జరుపుకుంటారు.
ఈ రోజునే విష్ణు సహస్ర నామం పుట్టిందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజున విష్ణు సహస్ర నామ జయంతి అని పిలుస్తుంటారు. విష్ణు సహస్ర నామ విశేషాలను భీష్ముడు పాండవులకు బోధించారని.. అందుకే వారు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారు.
పాండవులు అలా విష్ణువును వెయ్యి నామాలతో స్తుతించడం ద్వారా మహా సంగ్రామంలో విజయకేతనాన్ని ఎగురవేశారని పురాణాలు చెప్తున్నాయి. దేశ వ్యాప్తంగా భీష్మ ఏకాదశిని విష్ణు ఆలయాల్లో జరుపుతారు. రాష్ట్రంలో భీష్మ ఏకాదశి రోజున నరసింహ కల్యాణం చేయిస్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో, సింహాచలం నరసింహ స్వామి ఆలయంలో, యాదగిరి గుట్ట, భద్రచాలం సీతారాముల వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.
అందుచేత ఏకాదశి పర్వదినానికి ముందు రోజు రాత్రి అల్పాహారం తీసుకుని.. ఏకాదశి రోజు మధ్యాహ్నం ఒంటి పూట భోజనం చేయాలి. ఆ రోజున వరి, ధాన్యాలతో కూడిన వంటకాలను పక్కనబెట్టి. పండ్లు, నట్స్ తీసుకోవాలి. ద్వాదశి రోజున విష్ణువుకు పూజ చేశాక ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామ పారాయణ చేసే వారికి సకల సంపదలు చేకూరుతాయి. పసుపు రంగుతో కూడిన పండ్లు, స్వీట్లు స్వామికి ప్రసాదంగా సమర్పిస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అంతేగాకుండా ఆ రోజున గోవుకు అరటిపండ్లను అందిస్తే.. సకల దోషాలు తొలగిపోతాయి.
ఆ రోజున విష్ణువు ప్రత్యేక పూజలు, అలంకారాలు చేయించే వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. భీష్మ ఏకాదశి అని పిలువబడే ఈ రోజున భీష్మాచార్యునిని తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుంది. అంతేగాకుండా ఆ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని వినేవారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.