YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న కేన్సర్..!

దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న కేన్సర్..!

దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న కేన్సర్..!
హైదరాబాద్ ఫిబ్రవరి 5 
కేన్సర్ వ్యాధి గతంతో పోలిస్తే.. ఇప్పుడు మరింత విస్తరిస్తోంది. విన్నంతనే ఉలిక్కి  పడేలా చేస్తున్న విషయం తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో బయటకు వచ్చింది.కేన్సర్. ప్రతి ఒక్కరికి సుపరిచితం. ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే.. మనిషి శరీరంలోని ఒక కణం.. మరో కణాన్ని ఛిన్నాభిన్నం చేయటం. అలా శరీర వ్యవస్థల్ని పాడు చేసే మాయా దారి కేన్సర్.. శరీరంలోని కీలకమైన భాగాల్ని టార్గెట్ చేసి ఆరోగ్య కణాల్ని చంపేసి.. చావుకు దగ్గర చేస్తుంది.అయితే.. దేశంలో కేన్సర్ చాపకింద నీరులా విస్తరిస్తోందని.. ప్రతి పది మంది భారతీయుల్లో ఒకరికి కేన్సర్ వచ్చేస్తుందని తేలింది.2018లో భారత్ లో 1.16 మిలియన్ కేన్సర్ కేసులు కొత్తగా నమోదయ్యాయని.. దీని ప్రకారం ప్రతి 15 మందిలో ఒకరు మరణించే ప్రమాదం ఉందంటున్నారు. ఇదంతా ఏదో ఉత్త మాటలు కావని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వివరాల్ని బయటపెట్టింది.దేశ ప్రజల్లో ఎక్కువమంది రొమ్ము.. గొంతు.. గర్భాశయ.. పొట్ట..పేగు కేన్సర్లుఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. మొత్తం కేన్సర్ల లో పైన పేర్కొన్నవే నలభై ఐదు శాతం వస్తున్నట్లు గుర్తించారు. పొగాకు సంబంధిత ఉత్పత్తుల్ని తీసుకోవటం వల్ల కేన్సర్ ను కంట్రోల్ చేయటం కష్టమవుతుందని.. ఈ డేంజర్ ను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

Related Posts