YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

ట్రంప్ ప్రసంగ కాపీని చింపివేసిన స్పీకర్ నాన్సీ

ట్రంప్ ప్రసంగ కాపీని చింపివేసిన స్పీకర్ నాన్సీ

 ట్రంప్ ప్రసంగ కాపీని చింపివేసిన స్పీకర్ నాన్సీ
వాషింగ్టన్ ఫిబ్రవరి 5 
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు.. ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీలకు మధ్య విభేదాలు కొత్తేం కాదు. తాజాగా వీరిద్దరి మధ్య పోరు మరింత ముదిరి పాకాన పడింది. ఒకరికొకరు ఏ మాత్రం తగ్గకుండా వ్యవహరించిన వైనం సంచలనంగా మారింది. తాజాగా వార్షిక ప్రసంగం సందర్భంగా నాన్సీ పెలోజీ ముందుకు వచ్చిన అధ్యక్షుడు ట్రంప్ నకు షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ.. ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో ఒళ్లు మండిన స్పీకర్ నాన్సీ అనూహ్యంగా వ్యవహరించారు.అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ట్రంప్ కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి వార్షిక ప్రసంగం చేశారు. అంతకు ముందు తన ప్రసంగ కాపీని నాన్సీకి అందజేశారు. ఆ సందర్భంగా ఆమె అధ్యక్షుడి కి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ.. అందుకు ట్రంప్ సుముఖంగా లేరు. తాను షేక్ హ్యాండ్ కు చేతిని ఇస్తే.. స్పందించకుండా వెనక్కి తిరిగి వెళ్లిన ట్రంప్ తీరుపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.అనంతరం ట్రంప్ తన ప్రసంగాన్ని పూర్తి చేస్తున్న వేళ.. సభలోని వారంతా చప్పట్లు కొట్టే సమయం లో స్పీకర్ స్థానం లో ఉన్న నాన్సీ అనూహ్యం గా అధ్యక్షుల వారి ప్రసంగ కాపీని చించేశారు. దీంతో అక్కడి వారు అవాక్కు అయ్యారు. అధ్యక్షుల వారి ప్రసంగ పత్రాల్ని ఎందుకు చించేశారన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ఆయన చేసిన పనికి ప్రత్యామ్నాయం గా ఇదే మర్యాద పూర్వకమైన పని అని బదులిచ్చారు. గతంలోనూ వీరిద్దరి మధ్య రచ్చ ఘటనలు చోటు చేసుకున్నా.. ఇది మరింత తీవ్రమైనదిగా చెబుతున్నారు.

Related Posts